ఆ స్టార్ హీరో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన విజయ్ దేవరకొండ..!

Amruth kumar
ఇక టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ గురించి కొత్తగా పరిచ‌యం అక్కర్లేదు ఎందుకంటే ఆయన యూత్ లో బాగా ఫేమస్ అయిపోయారు. చిత్ర పరిశ్రమల్లో ఎదగాలి హీరోగా చేయాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్ నచ్చావులే , లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్  సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన అంతక పేరు రాలేదు. తర్వాత నానితో కలిసి ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నటించాడు.. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ కొట్టాడు.

ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోనే సంచనాన్ని క్రియేట్ చేసి ఓవర్ నైట్ లోనే రౌడీ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత వెనుకు తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే వీటన్నిటి కంటే ముందే దర్శకుడు పరుశురాం , రవితేజ కాంబినేషన్లో ఆంజనేయులు సినిమా వచ్చింది.. ఒక కీలక సన్నివేశంలో విజయ్ దేవరకొండ కెమేరా పట్టుకుని కనబడతాడు. ఈ సినిమాకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. డైరెక్టర్ ఓ సన్నివేశంలో విజయ్‌ను సినిమాలో చూపిస్తాడు. అయితే ఆంజనేయులు సినిమాకు మంచి పేరు వచ్చినప్పటికీ కమర్షియల్ గా ప్లాప్ అయ్యింది.

తాను  అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన పర‌శురామ్‌ డైరెక్షన్లోనే గీత గోవిందం సినిమాలో విజయ్ నటించి సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్ లో ఫ్యామిలీస్టార్ సినిమా వచ్చింది కానీ అది పరాజయం పాలైంది. లైగర్ సినిమా హిట్ అయ్యుంటే విజయ్ ఇప్పుడు ఓ రేంజ్ లో ఉండేవాడు. దురదృష్టవశాత్తూ అది అట్టర్ ఫ్లాప్ అయింది. హీరోగా అతని యాటిట్యూడ్ కూడా ఇంటర్వ్యూలిచ్చే సమయంలో మీడియాకు, సినీ ప్రేక్షకులకు నచ్చలేదు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రాబోతోందంటున్నారు. వాస్తవానికి ఈ కథ రామ్ చరణ్ కోసం అనుకున్నాడు గౌతమ్. చివరకు విజయ్ దగ్గరకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: