VD 12 : ఎలా ఉండబోతుందో తెలుసా.. ఆ పన్ ఇండియా మూవీపై కన్నేసిన గౌతమ్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన వరుస పెట్టి సినిమాలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. ఈయన హీరోగా రూపొందిన పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీతా గోవిందం , టాక్సీ వాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ఈయన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో అమాంతం పెరిగిపోయింది.

ఆఖరుగా విజయ్ దేవరకొండ "ది ఫ్యామిలీ స్టార్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ను ఫిక్స్ చేయని నేపథ్యంలో VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ఈయన విజయ్ , గౌతమ్ కాంబో మూవీ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో నాగ వంశీ మాట్లాడుతూ ..  విజయ్ , గౌతమ్ కాంబోలో రూపొందబోయే సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. గౌతమ్ తన స్టైల్ లో కే జీ ఎఫ్ సినిమాను తీస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో విజయ్ , గౌతమ్ కాంబో మూవీ ఉంటుంది అని నాగ వంశీ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇలా నాగ వంశీ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: