మోక్షజ్ఞ సరసన హీరోయిన్ కూతురు ?

Seetha Sailaja

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఫిలిమ్ ఎంట్రీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఫైనల్ కావడంతో ఆమూవీ షూటింగ్ ప్రారంభోత్సవం గురించి అందరు ఎదురు చూస్తున్నారు. ఈమూవీ కథ ఫైనల్ కావడంతో ఇప్పుడు దర్శకుడు ఈమూవీలో నటించబోయే నటీనటుల నటీనటుల ఎంపక విషయమై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తదాని మోక్షజ్ఞ పక్కన హీరోయిన్ గా ఎంపిక అయినట్లు లీకులు వస్తున్నాయి. ఆమధ్య రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి ఈమె హీరోయిన్ గా ఎంపిక అయినట్లు వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ రిషా తదాని లతో ఒక ఫోటో ఘాట్ తీసినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఆమె స్థానంలో చివరకు జాన్వీ కపూర్ ఎంపిక అయింది.  

అయితే రిషా తదాని తల్లి రవీనా టాండన్ ఏదోవిధంగా తన కుమార్తెను టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ చేయాలని చేస్తున్న గట్టి ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం వచ్చినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ నటించబోయే మొట్టమొదటి సినిమాలో రిషా తదాని హీరోయిన్ గా ఎంపిక అవ్వడం పక్కా అని అంటున్నారు. వాస్తవానికి ఆమె తల్లి రవీనా టాండన్  1993లో విడుదలైన ‘బంగారు బుల్లోడు’ మూవీలో బాలకృష్ణ సరసన నటించింది.

ఆమూవీ హిట్ అయిన తరువాత కొంత గ్యాప్ తీసుకుని నాగార్జునతో ఆకాశవీధి మూవీలో నటించింది. అయితే ఆమూవీ ఫ్లాప్ కావడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోవడంతో తిరిగి ఆమె బాలీవుడ్ బాట పట్టింది. మధ్యలో మంచు ఫ్యామిలీ తీసిన పాండవులు పాండవులు తుమ్మెద ఆమె కనిపించినప్పటికీ ఆపాత్ర ఆమెకు పెద్దగా పేరు తీసుకు రాలేదు.  అయితే ఇప్పుడు ఆమె కూతురు ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ సక్సస్ అయితే రిషా తదానా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసే ఆస్కారం ఉంది.ఈమూవీ 2026లో విడుదల అయ్యే అవకాశం ఉంది అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: