3 రోజుల్లో వెట్టాయన్ విధ్వంసం.. బ్రేక్ ఈవెన్ కి కావాల్సింది కేవలం అంతే..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా వెట్టాయన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ ఫార్ములాకు ఈ సినిమా ఎన్ని కోట్ల దూరంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి తమిళనాడు ఏరియాలో 59.40 కోట్ల కలెక్షన్లు రాగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.70 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక ఏరియాలో 15.10 కోట్ల కలెక్షన్లు రాగా , కేరళ లో 10.35 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.60 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్ సీస్ లో 53.90 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకి 75.10 కోట్ల షేర్ కలక్షన్లు రాగా ... 153.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

ఇక ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా మరో 86.90 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: