ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమా విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షో లను వేయడం సర్వసాధారణంగా జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. చిన్న సినిమాల విషయంలోనే ప్రీమియర్ షో లు ఎక్కువ అయ్యాయి. ఎందుకు అంటే చిన్న సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండవు. కనుక సినిమాను విడుదలకు ఒక రోజు ముందు కొన్ని ప్రాంతాలలో సినిమాను రిలీజ్ చేసినట్లయితే ఆ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదే నెగిటివ్ టాక్ వస్తే మొదటి రోజు వచ్చే కలెక్షన్లు కూడా రాకపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇకపోతే స్టార్ హీరోల సినిమాలను కూడా విడుదల రోజు అర్ధరాత్రి షో లు వేస్తున్నారు. అందులో భాగంగా కొంత కాలం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమాను కొన్ని ప్రాంతాలలో అర్ధరాత్రి షో లను ప్రదర్శించారు. ఇకపోతే ఈ షో లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా మొదటి రోజు మాత్రం మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ భారీ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్ట లేక పోయింది.
ఇకపోతే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 సినిమాకు సంబంధించిన షో లను కూడా విడుదల రోజు అర్ధరాత్రి కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ సినిమా అర్ధరాత్రి షోలకు కూడా కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు ఈ సినిమాకు కూడా గుంటూరు కారం మాదిరి గానే భారీ కలక్షన్లు వచ్చాయి. ఇక దేవర సినిమా మాత్రం భారీ కలక్షన్లను ఇప్పటికే వసూలు చేసింది. దేవర మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించాడు.