బాబాయ్ అలా అబ్బాయ్‌ ఇలా.. ఎక్కడ తగ్గడం లేదుగా నందమూరి హీరోలు..!

Amruth kumar
ఇక ప్రస్తుతం నట‌సింహ నందమూరి బాలకృష్ణ వరుస విజయాల తో ఫుల్ జోష్లో ఉన్న హీరో . ప్రస్తుతం తన 109 వ సినిమా ని బాబి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే బోయపాటి శ్రీను కాంబోలో అఖండ మూవీకి సిక్వెల్ గా అఖండ2 త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. నిన్న దసరా కనుకగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేశారు. అలాగే ఈ సినిమాకు బాలయ్య కూతురు  తేజస్విని కూడా సమర్పకురాలిగా ఉన్నారు. అదే విధంగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా వస్తున్న సినిమాకు సైతం తేజస్వి నిర్మాతగా సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు . ఇక మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన సినిమాలకు తన అన్న కళ్యాణ్ రామ్ సైతం సహ నిర్మాతగా వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇలా ఒకపక్క బాల‌య్య తన కూతుర్ని ప్రొడ్యూసర్ గా ప్రోత్సహిస్తూ ఉండగా.. ఎన్టీఆర్ తన అన్న నిర్మాతగా సక్సెస్ కావడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ తోడుగా ఉంటున్నాడు. ఇక కుటుంబ సభ్యులను నిర్మాతలుగా సక్సెస్ చేయడంలో అటు బాలయ్య ఇటు ఎన్టీఆర్ ఎక్కడ రాజీపడటం లేదుగా. ఈ విషయంలో ఈ బాబాయ్ - అబ్బాయిలను ఎంత మెచ్చుకున్న తక్కువే .. ఇక బాలయ్య - ఎన్టీఆర్ కాంబోలో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

అటు బాలయ్య ఇటు ఎన్టీఆర్ వరుస సినిమాలతో కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నరు ఈ సినిమాలు పాన్‌ ఇండియా సినిమాలుగా వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న వార్ 2తో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అలాగే త్వరలోనే ప్రశాంత్ నీల్ తో చేయబోయే భారీ పాన్ ఇండియా సినిమాని కూడా ప్రారంభించినాడు. బాలయ్య కూడా ఇప్పటికే బాబీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తుండగా... త్వరలోనే బోయపాటి షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. ఇలా ఈ నందమూరి హీరోలు బాక్సాఫీస్ వద్ద వరుస సినిమాలతో కలెక్షన్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: