అనేక మంది పర్యాటకులు పాపికొండలు బోట్ ట్రిప్ అంటే ఎంతో ఇష్ట పడుతుంటారు . ఇక్కడి వాతావరణాన్ని చూసి ఆనందించడానికి తహ తహలాడుతూ ఉంటారు . ఇక పోతే ఆంధ్రప్రదేశ్లో పాపికొండల టూర్ మళ్ళీ ప్రారంభం అయింది . తాజాగా పాపికొండలు బోటు టూర్ ని మళ్ళీ తిరిగి ప్రారంభించినట్లు ఏపీ టూరిజం శాఖ అధికారికంగా చెప్పుకొచ్చింది . విజయదశమి నుండి పాపికొండలు బోటు టూర్ ను తిరిగి ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం యూనియన్ నేతలు తెలిపారు . ఈ పర్యటన చేయాలి అనుకున్న వారు ఏపీ టూరిజం వెబ్సైట్ ద్వారా టూర్ ప్యాకే జీ బుక్ చేసుకోవచ్చు .
ఇక గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన పాపికొండలు బోట్ ట్రిప్ మళ్లీ ప్రారంభం అయింది. ఇకపై రోజు పాపికొండలు ఉన్నట్లు ఏపీ టూరిజం శాఖ తెలియజేసింది. ఈ టూర్ ను బోట్ల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి పాపికొండల్లో ప్రారంభించినట్లు తెలుస్తోంది. పాపికొండల్లో అనేక వసతులు ఉన్నట్లు , అక్కడ కొంతకాలం గడపడానికి అనేక ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టూర్ రాజమండ్రి నుండి ప్రారంభం అవుతుంది. మొదట రాజమండ్రి నుండి ప్రవేట్ బోట్ ట్రిప్ లు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత రాజమండ్రి నుండి గండి పోచమ్మ దేవాలయం వరకు కూడా వాహనాల్లో తీసుకువెళ్తారు.
ఇక అక్కడి నుండి లాంచీలో గోదావరిలో దాదాపు 75 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇక మధ్యాహ్నం రెండు గంటల వరకు పాపికొండల వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రదేశంలో కొద్ది సమయం పూర్తి అయ్యాక తిరిగి బొట్ లో సాయంత్రానికి గండి పోచమ్మ ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత రాజమండ్రి కి తీసుకు వస్తారు. ఇక ఈ టూర్ ప్యాకేజీ ఒకరికి వెయ్యి రూపాయల వరకు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.