యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ కు గ్లోబల్ గా క్రేజ్ వచ్చింది. ఇకపోతే తాజాగా ఈయన దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికీ కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు తాజాగా ఒక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి 16 రోజులు అవుతుంది. ఇక 16 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేర్ రికార్డును సృష్టించింది. అసలు విషయం లోకి వెళితే ... విడుదల అయిన 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్ట్ లో దేవర మొదటి స్థానంలో నిలిచింది.
ఇకపోతే ఈ సినిమా విడుదలైన 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.65 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 16 వ రోజు ఏ సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇలా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ రికార్డును 16 వ రోజు విషయంలో సాధించింది. ఇకపోతే ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించాడు.