సాయి పల్లవి అందం వెనక ఉన్న సీక్రెట్ వైరల్.. ఎగబడుతున్న కాలేజీ పాపలు..!
ఇక అంతే కాకుండా రోజు వ్యాయామం చేయటం వల్ల చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు.. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మంచి శరీరాకృతిని కాపాడుకోవటమే కాకుండా సహజ సౌందర్యాన్ని కూడా పొందవచ్చు. ఇక అలాగే మనం ఒంటికి సరిపడా నీరు తాగాలి.. అలాగే మన శరీరాన్ని పునరుద్దింప చేయడానికి నీరు ఎంతగానో సహాయపడుతుంది. ఎక్కువ నీరు తాగటం కారణంగా మచ్చలు ముడతలు పోయి మృదుమైన చర్మం వస్తుంది. ముఖ్యంగా తగినంత నీరు త్రాగని వ్యక్తులలో త్వరగా ముడతలు వచ్చే అవకాశం ఉందట. అలాగే ఆమె మాట్లాడుతూ.. నా జుట్టు అలాగే చర్మ సంరక్షణ కోసం నేను షాంపూ లేదా సింథటిక్ రసాయనాలు కలిపిన సబ్బులను ఎప్పుడు ఉపయోగించను.
సహజసిద్ధమైన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తాను. పైగా నా జుట్టుకి నేను ఏ రోజు రంగులు వేయలేదు అంటూ తెలిపింది. దీనికి తోడు హానికరమైన మేకప్ ఉత్పత్తులను దూరం చేయండి అంటూ చెప్పుకొచ్చింది. వీటిని ఉపయోగించడం వల్ల చర్మం పైన బొబ్బలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలు చర్మం పగిలిపోవడం, గీతలు పడడం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయని సాయి పల్లవి తెలిపింది.ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తాను కాబట్టే తాను నేచురల్ బ్యూటీ అనిపించుకుంటున్నాను అంటూ సాయి పల్లవి తెలిపినట్లు సమాచారం.