మిల్కి బ్యూటీ ‘తమన్నా భాటియా’.. ఈ పాన్ ఇండియా హీరోయిన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఈమె కూడా ఒకరు. ఇకపోతే తమన్నా.. తన 15 ఏళ్ల వయసులోనే వెండితెరపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట తెలుగులో శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా తర్వాత.. హ్యాపి డేస్ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హ్యాపి డేస్ సినిమా తర్వాత తమన్నా కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.ఎందుకంటే.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో అలరిస్తూ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇకపోతే ఈమె అందం,నటన, డ్యాన్స్ కు ఫిదా కానీ ప్రేక్షకులంటూ ఉండరు. అయితే ప్రస్తుతానికి ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ భాషల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది.ఇదిలావుంటేటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఇంకా వివాహం చేసుకోకుండా బ్యాచిలర్స్ గానే జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే తమ అభిమాన హీరోకి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అంటూ చాలామంది హీరోల అభిమానులు తెగ ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. అయితే అలాంటి బ్యాచిలర్ హీరోలకి ఒక గుడ్ న్యూస్ అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగినా.. కొంతమంది నెటిజన్స్ మాత్రం ఈ హీరోయిన్ తో పెళ్లికాని హీరోలు నటిస్తే పెళ్లి జరుగుతుంది అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకున్నారు.
అలా 2011లో లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకోగా, అదే ఏడాది అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నారు. మరుసటి ఏడాది రామ్ చరణ్ ఉపాసనని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ హీరోలు ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకోవడానికి కారణం ఒకే ఒక్క హీరోయిన్. అయితే వీళ్లంతా పెళ్లిలు చేసుకోవడానికి కారణం నేనే అంటూ సదురు హీరోయిన్ ఆ విషయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా.ఇకపోతే రామ్ చరణ్ సరసన రచ్చ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించినది. ఆ సినిమా విడుదల కాకముందే రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఎన్టీఆర్ తో తమన్నా ఊసరవెల్లి చిత్రంలో నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ కూడా పెళ్లి చేసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా బద్రీనాథ్ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు.. ఇలా మొత్తానికైతే ఈ ముగ్గురు హీరోలతో జతకట్టడం ప్రారంభించిందో లేదో అప్పుడే వివాహాలు అయిపోయాయి. ఏది ఏమైనా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఇది యాదృచ్ఛికంగా జరిగినా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. తమన్నాకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె ఎక్కువగా హిందీలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హిందీలో హీరోయిన్ గా మాత్రమే కాకుండా అతిథి పాత్రలు కూడా చేస్తుంది. అలాగే మరోవైపు తమిళ్ కూడా ఈ బ్యూటీ పలు సినిమాల్లో అలరిస్తుంది. కాగా, ఇటీవలే రణ్మనై 4 తో తమన్నా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.