పండగ పూట మెగా జాతర.. చిరు ‘విశ్వంభర’ టీజర్ అంతకు మించి .. గట్టిగానే ప్లాన్ చేశారుగా..!

Amruth kumar
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభరా నుంచి విజయదశమి కానుకగా టీజర్ విడుదల చేశారు .. అది చూస్తే మెగా ఫ్యాన్స్ , ప్రేక్షకులకు  పూనకాలు తెప్పిస్తుంది. ఇది మెగాస్టార్ మాస్ జాతర అనే చెప్పాలి. చిరు హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో వస్తున్న విశ్వంభరాను యూవి క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మెగా అభిమానులను ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసి ఆకట్టుకుంది. ఈరోజు విడుదలైన టీజర్ అంతకు మించి విజువల్ వండర్ అన్నట్టుగా ఉంది.

కళ్యాణ్ రామ్ బింబిసారని మించే విధంగా మెగాస్టార్ తో కొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేశాడు దర్శకుడు వశిష్ట. ఎగిరే గుర్రం మీద నుంచి మెగాస్టార్ చిరంజీవి వచ్చిన విజువల్స్ ప్రేక్షకులు చేత వీళలు తెప్పించేలా ఉంది. బింబిసారా అలాంటి తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న వశిష్ట.. ఇప్పుడు  తన అభిమాన  హీరో చిరంజీవి తో కలిసి విశ్వంభర ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర్కెక్కిస్తున్నాడు .  ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు.  అది టీజర్ విజువల్స్, 93 సెకన్లలో స్పష్టంగా కనిపించింది.

ఇక ఇందులో టాప్ - లెవల్ వీఎఫ్ఎక్స్ , హై - ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌లు , అద్భుతమైన డ్రామాతో ... అన్నీ కలిపి ఇదొక విజువల్ వండర్‌గా ఉంటుందని తెలుస్తోంది . మొత్తానికి ఈ టీజర్ విశ్వంభర పై భారీగా అంచనాలను పెంచేసింది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ మువీలో చిరంజీవి సరసన హీరోయిన్‌ త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చిరు, త్రిష కలిసి నటిస్తున్న మువీ ఇదే. మీనాక్షి చౌదరి, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా.. వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: