కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ , వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఇకపోతే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాను వక్కంతం వంశీ మొదటగా అల్లు అర్జున్ తో కాకుండా మరో హీరోతో అనుకున్నాడట. ఆయన రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ ఏరి కోరి ఈ సినిమాను ఎంచుకున్నాడట.
అసలు ఏం జరిగింది ..? ఎందుకు బన్నీ ఈ సినిమా కథను ఎంచుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం. కథ రచయితగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వక్కంతం వంశీ తానే సొంత కథతో దర్శకత్వం చేయాలి అనే ఉద్దేశంతో ఒక కథను రాసుకున్నాడట. దానిని ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ కి వినిపించాడట. ఇక ఎన్టీఆర్ ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడట. ఇదే సమయంలో అనుకోకుండా బన్నీ కలవడం జరిగిందట. దానితో వంశీ , ఎన్టీఆర్ కు చెప్పిన కథ మొత్తాన్ని అల్లు అర్జున్ కి వివరించాడట. కథ సూపర్ గా ఉంది ఎన్టీఆర్ కి బ్లాక్ బాస్టర్ పడినట్టే అన్నాడట.
ఆ తర్వాత ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ కు బన్నీ ఫోన్ చేసి సూపర్ కథ పెట్టావు. బ్లాక్ బస్టర్ అవుద్ది అన్నాడట. కానీ ఎన్టీఆర్ ఆ విషయంపై పెద్దగా రియాక్ట్ కాలేదట. ఆ తర్వాత వంశీ ద్వారా ఎన్టీఆర్ ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసిందట. ఇక దానితో బన్నీ అదే కథతో మూవీ చేయాలి అని డిసైడ్ అయ్యి వంశీ కి చెప్పాడట. అలా జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథనే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే పేరుతో బన్నీ పై వంశీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది.