అమెరికాలో మ‌రో సెన్షేష‌న‌ల్ రికార్డు బీట్ చేసిన ' దేవ‌ర‌ ' ... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా దేవర. గ‌త నెల 27 న రిలీజ్ అయిన దేవ‌ర సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. గ‌తంలో దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ హిట్‌. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్ రిపీట్ కావ‌డంతో ఖ‌చ్చితంగా దేవ‌ర కూడా సూప‌ర్ హిట్ అవుతుంద‌నే అంద‌రూ అనుకున్నారు. సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా కూడా దేవ‌ర సూప‌ర్ హిట్ అయిపోయింది. ఈ ప్యూర్ మాస్ యాక్షన్ డ్రామాకు ప్రేక్షకులు మామూలుగా ఫిదా అవ్వ‌డం లేదు.  రిపీటెడ్ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో కలెక్షన్ల వర్షం అయితే ఆగ‌కుండా కురుస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే ‘దేవర’  సినిమా అమెరికాలో ముందు నుంచి వ‌సూళ్ల మోత మోగించేస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ఓవర్సీస్‌లో ఇప్పుడు మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా 6 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి అస‌లు మామూలు సంచ‌ల‌న రికార్డులు న‌మోదు చేయ‌లేదు అని చెప్పాలి. ఎన్టీఆర్ త‌న అదిరిపోయే పెర్సామెన్స్ తో ఓవర్సీస్ ఆడియెన్స్ ఊగిపోతున్నారు. ఎన్టీఆర్ కు 2015లో వ‌చ్చిన టెంప‌ర్ సినిమా నుంచి మొద‌లు పెడితే ఇది వ‌రుస‌గా ఏడో హిట్ సినిమా అని చెప్పాలి.

ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన దేవర సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర కీల‌క పాత్ర ల‌లో నటించారు. ఈ చిత్రానికి ప్ర‌ముఖ త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన‌ మ్యూజిక్ సెన్సేషనల్ రెస్పాన్స్‌ను అందుకునేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: