తమిళ టైటల్స్ మ్యానియా !

Seetha Sailaja
తెలుగు ప్రజలకు విశాల హృదయం ఎక్కువ తమిళ సినిమాలు డబ్ చేసి తెలుగులో విడుదల చేస్తున్నప్పుడు ఆసినిమాల టైటిల్స్ తమిళ భాషలో ఉన్నప్పటికీ పట్టించుకోకుండా చాల ఉదారంగా ఆసినిమాలను చూసి ఆదరిస్తున్నారు. గతంలో మణిరత్నం తన సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నప్పుడు ఎక్కడా డబ్బింగ్ సినిమాలు అని అనిపించకుండా చక్కటి తెలుగులో సంభాషణలు పాటలు దగ్గర ఉంది వ్రాయించుకోవాడమే కాకుండా తన సినిమాలకు అందరికీ అర్థం అయ్యే తెలుగు టైటిల్స్ పెట్టేవాడు.

‘ఘర్షణ’ ‘సఖీ’ ‘యువ’ ‘నాయకుడు’ ‘చెలియా’ వంటి టైటిల్స్ తో సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసేవాడు. అయితే ప్రస్తుత తరం తమిళ దర్శకుడు అలాంటి ఓపిక తీరిక లేక కాబోలు తమ భారీ తమిళ సినిమాలను టైటిల్స్ లను కూడ మార్చకుండా విడుదల చేస్తున్నారు. ఈవిషయాన్ని కూడ పట్టించుకోకుండా మన తెలుగు ప్రేక్షకులు ఆసినిమాలను చూసి ఎంజాయ్ చేయడం చాలామందికి షాకింగ్ గా మారింది.  

దీనితో తెలుగు ప్రేక్షకుల ఆత్మాభిమానం దెబ్బ తింటోంది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నా వాటిని కోలీవుడ్ దర్శకులు పట్టించుకోవడం లేదు. ‘రాయన్’ ‘కంగువ’ ’వెట్టయాన్’ అన్న టైటిల్స్ తో సినిమాలు వస్తుంటే ఆసినిమాలకు మంచి బిజినెస్ జరగడమే కాకుండా ఆసినిమాల పై క్రేజ్ ఏర్పడి మంచి కలక్షన్స్ వస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

‘దసరా’ రేస్ లోకి ఎంటర్ అవుతున్న ‘వెట్టయాన్’ అంటే తెలుగులో ‘వేటగాడు’ అని అర్థం. అయితే రాజనీకాంత్ ను విపరీతంగా ఆరాదించే తెలుగు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అయినా ఈసినిమాకు ‘వేటగాడు’ అన్న టైటిల్ పెట్టవచ్చు కదా అంటూ కొందరు తెలుగు భాషా అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఇలాంటి సూచనలు విమర్శలు పట్టించుకునే స్థితిలో తమిళ ఫిలిమ్ ఇండస్ట్రీ లేదు. ఒకప్పుడు తెలుగులో టైటిల్స్ పెట్టి తన సినిమాలను విడుదల చేసిన మణిరత్నం లాంటి దర్శకులు కూడ ‘పొన్నియన్ సెల్వవన్’ అంటూ తన సినిమాను విడుదల చేస్తే ఆసినిమాను కూడ ఆదరించారు..  .  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: