"ఓరేయ్..ఇకనైన కళ్ళు తెరవండి రా"..సమంత మాటలకి ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్..!!

Thota Jaya Madhuri
గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ఒకే వార్త యమ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అది కూడా టాప్ సెలబ్రిటీ కి సంబంధించిన వార్త కావడంతో చాలామంది జనాలు ఆ వార్తను బాగా బాగా వైరల్ చేస్తున్నారు .మనకు తెలిసిందే మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య విడాకులపై సంచలన ఆరోపణలు చేసింది . నాగార్జున ఎన్  కన్వెన్షన్ హాల్ ను కూల్చకుండా ఉండాలి అంటే దానికి బదులుగా అక్కినేని ఇంటికి కోడలుగా ఉన్న సమంతను తన దగ్గరకు పంపాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేశాడు అని ..నాగార్జున డబ్బు మీద ఉన్న మోజుతో కోడలు సమంతను కేటీఆర్ వద్దకు పంపాలి అని ట్రై చేశాడు అని.. మొదటి నుంచి చాలా చాలా పద్ధతిగా ఉండే సమంత అలాంటి విషయాలను యాక్సెప్ట్ చేయలేక చాలా బాధపడింది అని.. నాగార్జున , కేటీఆర్ వద్దకు వెళ్లకుండా ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటూ బాధ పెట్టే విధంగా మాట్లాడాడు అని.. ఆ కారణంగానే నాగచైతన్య - సమంత విడాకులు తీసుకున్నారు అని చాలా చాలా నీచమైన ఆరోపణలు చేసింది .


దీనికి సంబంధించి చాలా మంది ప్రముఖులు కూడా కొండా సురేఖను వార్న్ చేస్తూ ట్వీట్లు కూడా చేస్తున్నారు. అయితే మొదటగా నాగార్జున ..కొండా సురేఖకు మర్యాదపూర్వకంగానే వార్నింగ్ ఇస్తూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అని హెచ్చరించారు . ఆ తర్వాత సమంత కూడా కొండ సురేఖ గారు అంటూ  ట్వీట్ చేస్తూ మర్యాదపూర్వకంగానే మాట్లాడుతూ ..ఆమె మాట్లాడిన మాటల్లో నిజం లేదు అంటూ కన్ఫర్మ్ చేసింది. ఇది అక్కినేని ఫ్యాన్స్ అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.


అయితే మొదటి నుంచి సమంతను చాలా దారుణంగా ట్రోల్ చేసే అక్కినేని ఫ్యాన్స్ కు ఇప్పుడు సమంత అభిమానులు భారీ భారీ కౌంటర్లు వేస్తున్నారు . సమంతదు ఎంత మంచి మనసో అర్థం చేసుకోండి.. తనను నిర్దాక్షిణ్యంగా వదిలేసినా.. తనకు ఆరోగ్యం బాగో లేకపోయినప్పటికీ పట్టించుకోకపోయినా ..అక్కినేని నాగార్జున పై అలాగే నాగచైతన్య పై లేనిపోని నిందలు వేస్తే చూసి నవ్వుకోకుండా సమంత.. కొండా సురేఖకు ట్వీట్ చేసి మరి తన మాజీ అత్తగారి ఇంటి పరువు పోకుండా కాపాడింది ..అది  సమంత  రియల్ క్యారెక్టర్ అంటే.. ఇకనైనా ఎవడైతే సమంతని ట్రోల్ చేస్తున్నారో..వాళ్లు బుద్ధి తెచ్చుకోండి రా.. అంటూ సమంత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తూ ఆమెను ట్రోల్ చేసే వారికి ఇచ్చిపడేస్తున్నారు . మొత్తానికి ఒకే ఒక్క ఇన్సిడెంట్ తో సమంత టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది . అందరి కళ్ళకు ఇప్పుడు ఆమె బంగారు దేవతగా కనిపిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: