రవితేజకు షాక్.. వెంకీ2 హీరో ఫిక్స్.. శీనువైట్ల షాకింగ్ కామెంట్స్..!

Amruth kumar
20 సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా, శ్రీనువైట్ల డైరెక్షన్ లో వచ్చిన వెంకీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది . అలాగే ప్రస్తుతం వెంకీ సినిమాలో ని కొన్ని సీన్స్ రూపంలో ఎక్కువ గా సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతూనే ఉన్నాయి . ఇక వెంకీ పాత్రలో రవితేజ పండించిన కామెడీ ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్ గా నిలిచిపోయింది. మరి ముఖ్యంగా ఈ సినిమాలోని ట్రైన్ సీక్వెన్స్ కామెడీ సినిమాలను ఆస్వాదించే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. ఇక వేణుమాధవ్ , ఏవీఎస్, బ్రహ్మానందం మధ్య వచ్చే ఈ ట్రైన్ సీక్వెన్స్ ఎన్నో సినిమాలుకు ట్రెండ్ సెట్టర్నే చెప్పాలి. అయితే గతంలో దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ ఈ సినిమాకి సిక్వల్ గా వెంకీ 2 ను తెరకెక్కించబోతున్నానని కూడా చెప్పారు. ఆడియన్స్ కూడా వెంకీ 2ను ఎప్పుడు తీస్తారు ఎవరితో తీస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా మాచో స్టార్ గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఈ విశ్వం దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు శ్రీనువైట్ల వెంకీ 2 గురించి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఇక‌ యాంకర్ వెంకీ సీక్వెలను ఇప్పుడున్న స్టార్ హీరోలలో ఏ హీరోతో తీస్తాడని ప్రశ్న శ్రీనువైట్లకు ఎదురైంది. ఆ ప్రశ్నకు శ్రీనువైట్ల జవాబు ఇస్తూ ఈ తరం హీరోల్లో అందరూ మంచి కామెడీ టైమింగ్ ఉన్నవాళ్లే వారిలో ఎవరికైనా వెంకీ 2 కథ‌ సూట్ అవుతుంది . ఒకరి పేరు చేపటం కష్టమని.. ఏ హీరో అయిన తమకు ఇచ్చిన పాత్రలో బాగా చేస్తారని ఆయన చెప్పాడు . 2004 మార్చి 26 న విడుదలైన వెంకీ సంచలనం సృష్టించింది. రవితేజ పోషించిన వెంకీ పాత్ర, హీరోయిన్‌ స్నేహ నటించిన శ్రావణి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: