తెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు గా కొనసాగిన వారిలో కృష్ణ , చిరంజీవి కూడా ఉంటారు . ఇకపోతే కృష్ణ , చిరంజీవి ఎంతో సన్నిహితంగా ఇండస్ట్రీ లో కొనసాగారు . ఇది ఇలా ఉంటే ఒకానొక సమయంలో కృష్ణ చేయాలి అనుకున్న సినిమాను చిరంజీవి చేశాడు. అలాగే ఆ మూవీ తో ఏకంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అసలు ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం ... 1987 వ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయశాంతి , సుమలత హీరోయిన్లుగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పసివాడి ప్రాణం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమా హాలీవుడ్ మూవీ అయినటువంటి విట్నెస్ అనే చిత్రం ఆధారంగా మలయాళం లో పోవును పుతియా పాంథేన్నల్ అనే చిత్రం రూపొందింది. ఇకపోతే ఈ సినిమాని తెలుగు లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా విజయ భాపినీడు రీమిక్ చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా ఈ విషయాన్ని కృష్ణ తో కూడా చెప్పాడట. ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలాగే ఈ సినిమాలో చిన్న పిల్లాడి పాత్ర కోసం మహేష్ బాబును తీసుకోవాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారట.
ఇలా ఓ వైపు విరు ఈ సినిమాని తెలుగు లో రూపొందించాలి అని ప్లాన్స్ వేసుకుంటూ ఉండగా అంత లోపే చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణం లో పసివాడి ప్రాణం సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చిందట. ఇలా ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రావడంతోనే కృష్ణ ఈ సినిమాని పక్కన పెట్టేసాడట. ఇకపోతే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.