ఈ ఏడాది అత్యధిక ప్రాఫిట్ ఇచ్చిన సినిమా.. దేవర, కల్కి కాదు.. ఏదంటే?

praveen
సాధారణంగా ఇండియాలో ప్రతి ఏడాది వందల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక సినిమాలో కంటెంట్ ప్రేక్షకులకు నచ్చింది అంటే చాలు ఆ సినిమా భాషతో పని లేకుండా సూపర్ హిట్ సాదిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కమర్షియల్ సినిమాలను మించిన విజయాలు సాధిస్తూ నిర్మాతలకు ఎన్నో లాభాలు తెచ్చిపెడుతున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ చివరికి నిర్మాతలకు మాత్రం  నష్టాలని మిగులుస్తూ ఉంటాయి.

 అల్టిమేట్ గా ప్రేక్షకులకు కావాల్సింది రెండు మూడు గంటల వినూత్నమైన వినోదం. అలాంటి వినోదం కోసమే ఇక థియేటర్కు వెళ్తూ ఉంటారు ప్రేక్షకులు.  ప్రేక్షకులకు ఆ వినోదం అందిందా లేదా అన్నదే ఫైనల్ రిజల్ట్ కి కారణంగా మారిపోతూ ఉంటుంది.  2024 ఏడాదిలో కూడా ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఈ సినిమాలలో ఎన్నో కమర్షియల్ సినిమాలు కూడా ఉన్నాయ్. బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయ్.అదే సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ విక్టరీలను సొంతం చేసుకున్నాయ్. మరి ఈ ఏడాది విడుదలైన సినిమాలలో నిర్మాతలకు ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టిన సినిమా ఏది అన్నది హాట్ టాపిక్ గా మారింది.

 తెలుగు ప్రేక్షకులను ఈ మాట అడిగితే ప్రభాస్ హీరోగా నటించిన కల్కి లేదంటే తారక్ హీరోగా నటించిన దేవర మూవీలే ఇక నిర్మాతలకు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టాయి అని చెబుతారు. అలా అనుకుంటే మాత్రం పొరపడినట్లే. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడి సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కానీ నిర్మాణ వ్యయం 600 కోట్లకు పైగానే కావడంతో.. ఇక ఈ సినిమాకు వచ్చిన లాభాలు కేవలం 400 కోట్లకు పైగానే. ఇక తారక్ హీరోగా వచ్చిన దేవర 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. కానీ ఈ సినిమా 350 కోట్ల బడ్జెట్ తెరకేక్కించడంతో సినిమా హిట్ అయిన నిర్మాతలకు వచ్చిన లాభాలు తక్కువే. ఇక బాలీవుడ్ మూవీ స్త్రీ 2 ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. 50 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 800 కోట్లు రాబట్టింది. ఇక ఈ ఏడాది వచ్చిన మంజుమాల్ బాయ్స్ 20 కోట్ల బడ్జెట్ తో తలకెక్కి 242 కోట్లు సాధించింది. బడ్జెట్ కంటే 12 రేట్లు అధికం. కానీ కేవలం మూడు కోట్లతో తెరకెక్కి 100 కోట్లు సాధించి నిర్మాతలకు ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా నిలిచిందిప్రేమలు. సరికొత్త కథాంశంతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ప్రేమలు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. 136 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది అంటే పెట్టిన పెట్టుబడి కంటే 4500% ఎక్కువ కలెక్షన్స్. అందుకే ఈ ఏడాది నిర్మాతలకు అత్యధిక ప్రాఫిట్ అందించిన సినిమాల్లో ప్రేమలు నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: