అభిమానులకు సడన్ షాక్ ఇచ్చినస్టార్ హీరో.. గుర్తుపట్టడం కష్టమే..!

Divya
చాలామంది నటీనటులు సైతం కొన్ని సందర్భాలలో చూసిన లుక్స్ చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా స్టైలిష్ గా కనిపించేందుకు ఎక్కువ ఇష్టపడే సౌత్ హీరోలలో హీరో అజిత్ కూడా ఒకరు.సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సెలబ్రిటీలలో మొదటి స్థానంలో ఉంటారు హీరో అజిత్. బ్యాక్ టు బ్యాక్ వరుస  సినిమాలతో అలరిస్తునే అజిత్ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం అసలు ఎక్కడా కనిపించారు. అయితే ఇప్పుడు తాజాగా హీరో అజిత్ సరికొత్త లుక్ చూసి అభిమానులు కూడా గుర్తుపట్టలేదు.

అజిత్ ఎప్పుడూ కూడా చాలా స్టైలిష్ గానే కనిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. తునివు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అజిత్ ప్రస్తుతం విదాముయార్చి  అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజిల్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష, రెజీనా తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతున్న సమయంలో అజిత్ 63వ చిత్రాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈయన గతంలో మార్క్ ఆంటోనీ సినిమాని తెరకెక్కించారు.

తాజాగా హీరో అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్స్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానులు మొదట హీరో అజిత్ ని గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది హీరో అజిత్ ఇంత స్టైలిష్ గా ఉన్నారేంటి అంటే ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ ఫోటోలను అజిత్ కాస్త బరువు తగ్గినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇది సినిమా కోసమే ఇలా తగ్గిపోయారు అనే విధంగా వార్త వినిపిస్తున్నాయి. అజిత్ నటిస్తున్న విదాముయార్చి చిత్రాన్ని దీపావళికి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే అజిత్ తన తదుపరిచిత్రం కోసం సరికొత్త లుక్కులో కనిపించేందుకే ఇలా తయారయ్యారు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: