సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి పద్ధతి ఒక్కోరకంగా ఉంటుంది. కొంత మంది దర్శకులు కేవలం చిన్న హీరోలతో , మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రం ఏ హీరోతో ఛాన్స్ దొరికితే ఆ హీరోతో సినిమాలు చేస్తూ వస్తారు. ఇక మరి కొంత మంది దర్శకులు మాత్రం కేవలం స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి అనేక సమయం వెయిట్ చేసి అయిన వారితోనే సినిమాలు చేసే దర్శకులు కూడా మన తెలుగు సినీ పరిశ్రమలో కొంత మంది ఉన్నారు.
ఇలాంటి వారిలో వంశీ పైడిపల్లి , కొరటాల శివ కూడా ముందు వరుసలో ఉన్నారు. వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో కూడా స్టార్ హీరోలే ఉన్నారు. ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన మున్నా సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం , ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఎవడు , ఆ తర్వాత టాలీవుడ్ కింగ్ నాగార్జున , కార్తీ హీరోలుగా ఊపిరి , ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా మహర్షి , ఆ తర్వాత తమిళ నటుడు విజయ్ తో వారిసు మూవీలను తెరకెక్కించాడు.
ఇక కొరటాల శివ , ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి మూవీతో దర్శకుడిగా కెరీర్ను మొదలు పెట్టి ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ , మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను , మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య మూవీలను రూపొందించాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 1 అనే మూవీ ని కొరటాల రూపొందించాడు. ఇలా ఈ ఇద్దరు దర్శకుడు కేవలం స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు.