' వార్ 2 ' లో ఎన్టీఆర్ ఎంట్రీ ఎప్పుడు... ఫ్యీజులు ఎగిరిపోయే అప్డేట్‌...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ హిట్ దేవర.. బాక్సాఫీస్ దగ్గర వసూళ‌ వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా తొలి వారం రోజులు ముగిసేసరికి ఏకంగా రూ.405 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన తీరుకు తెలుగు సినిమా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కేవలం తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా.. అటు బాలీవుడ్, ఇటు తమిళం, కన్నడం, అటు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా దేవర సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

దసరా సెలవులు కూడా ప్రారంభం కావడంతో దసరా వరకు దేవర ఎలాంటి ఢోకా లేకుండా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోవటం కాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్.. తన తర్వాత మూవీ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. దేవర సినిమాకు కొనసాగింపుగా దేవర 2 తర్వాత పట్టాలెక్కనుంది. మధ్యలో ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న వార్‌ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వార్ 2 సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది.
 
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత షెడ్యూల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభించేందుకు మూవీ యూనిట్ సిద్ధం అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. అందాల భామ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: