సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో బాక్సాఫీసు దుమ్ముదులిపేశాడు. తన రేంజ్ ఏంటో బాక్సాఫీసుకి చూపించాడు. ఇప్పుడు వేట్టయన్ సినిమాతో వస్తున్నాడు రజనీకాంత్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా కావడం విశేషం. ఈ మూవీని లైకా ప్రొడక్షన్ నిర్మించింది. సుభాస్కరన్ నిర్మాత. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ పాజిల్ ముఖ్య పాత్రల్లో నటించారు. రానాది నెగటివ్ రోల్ అని తెలుస్తుంది. ఈ మూవీ దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేశారు. రెగ్యూలర్ రజనీకాంత్ మాస్, యాక్షన్ మూవీలా లేదు. కంటెంట్ ఓరియెంటెడ్‌గా
ఉంది. బలమైన విషయాన్ని ఇందులో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఇది సూపర్ స్టార్‌ని ఓ కొత్త తరహాలో ఆవిష్కరించబోతుందని తెలుస్తుంది. మరో రకంగా ఆయన సాహం చేస్తున్నారనే చెప్పాలి. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో రజనీకి జోడీగా మంజు వారియర్ నటిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో లో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు గుర్తించిన వైద్యులు. ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం
కోలుకున్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా 'కూలీ' షూటింగ్ కారణంగా రజనీకి ఆరోగ్యసమస్యలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఈ వివాదంపై కూలి చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ వివరణ ఇచ్చారు. లోకేష్ మాట్లాడుతూ ' ఆ వార్తల్లో నిజం లేదు, అసలు ఇలాంటివి ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు. ఇటువంటి ఫేక్ న్యూస్ విన్నపుడు ఎంతో బాధగా ఉంటుంది. గత నెల రజనీకాంత్ వైజాగ్ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందని చెప్పారు. అందుకు అనుగుణంగా సెప్టెంబర్ 28 లోగా రజనీ సీన్స్ షూటింగ్ పూర్తి చేశాం. 30వ తేదీన ఆయన ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్ మాకు ముఖ్యం కాదు. ఇంకోసారి ఇటువంటి వార్తలు రాసే తప్పుడు పూర్తిగా తెలుసుకుని అవగాహన వచ్చిన తర్వాతే రాయండి అని కోరుతున్న. అంటూ తెలిపాడు..!!