ఆర్జీవీ నోటి దూల...సమంతకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పొద్దు !

Veldandi Saikiran
దేశం వ్యాప్తంగా అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు గురించి హాట్‌ టాపిక్‌ అయింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నటి సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. కొండ సురేఖ సమంత చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కామెంట్లపై నటి సమంత, నాగార్జున కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ స్పందించారు. సమంత ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ తన మాటలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అంతేకాకుండా కొంతమంది సాటి మహిళ అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదంటూ కొందరు నటీమణులు స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరూ స్పందించడం విశేషం. తాజాగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆర్జీవి రియాక్ట్ అయ్యాడు. కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పడమేంటి? తాను చేసిన వ్యాఖ్యలలో అత్యంత జుగుప్సాకరంగా అవమానించిందంటూఫైర్ అయ్యారు ఆర్జీవీ.  అక్కినేని నాగార్జునని, నాగచైతన్యని... ఒక భర్త, మామగారు, ఒక కోడలిని, ఒక భార్యని వారికి సంబంధించిన ఆస్తిని కాపాడుకోవడానికి ఇబ్బంది పెట్టి అలా పంపించడానికి ట్రై చేయడం ఏంటి? అంటూ కొండా సురేఖపై ఫైర్‌ అయ్యారు.
అలా చేస్తే తాను విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన అవమానం నేను నా జీవితంలో వినలేదు, చూడలేదంటూ వర్మ పేర్కొన్నారు. ఇది కేవలం సమంతను అవమానించడం ఎలా అయ్యింది? వారి కోసమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరి కోసం ఈ విషయాన్ని నాగార్జున, చైతన్య సీరియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరికి మరిచిపోలేని గుణపాఠం నేర్పాలని కోరారు. కొండా సురేఖ సమంతకు కాకుండా అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి అంటూ ఆర్జీవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అటు ఈ అంశంపై కొండా సురేఖ స్వారీ చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV

సంబంధిత వార్తలు: