కొరటాల ను డేంజర్ జోన్ లో పడేసిన ఎన్టీఆర్ లైనప్.. కొరటాలకు ఆప్షన్ లేదా..?

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ కి వచ్చిన కూడా భారీగానే కలెక్షన్లను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాకు చాలా దగ్గరగా వచ్చింది. మరో రెండు , మూడు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... దేవర మొదటి భాగం పూర్తయిన తర్వాత వెంటనే దేవర రెండోవ భాగం షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ శాతం ఉన్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికే కొన్ని సినిమాలకు కమిటీ అయి ఉన్నాడు. ఆ సినిమాల షూటింగ్ పూర్తి కాగానే దేవర పార్ట్ 2 మూవీ ఉంటుంది అని అనౌన్స్ చేశాడు. ఇకపోతే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ "వార్ 2" మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. అలాగే ప్రశాంత్  నీల్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యి ఉన్నాడు.

ఈ రెండు మూవీల షూటింగ్లో కంప్లీట్ అయ్యాక దేవర 2 షూటింగ్ స్టార్ట్ అయినట్లయితే దానికి చాలా టైమ్ పడుతుంది. మరి అంత కాలం పాటు కొరటాల దేవర 2 కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తూ ఉంటాడా ... లేక గ్యాప్ లో మరో మూవీ ని విడుదల చేస్తాడా అనేది చూడాలి. ఇకపోతే దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: