నందమూరి బాలకృష్ణ ఆఖరు గా భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు . ఈ సినిమా తర్వాత బాలయ్య , బాబి దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు . ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతుంది . ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయం లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నికల కోడ్ రావడంతో బాలయ్య అటు వైపు కొంత కాలం దృష్టి పెట్టాడు. దానితో కొంత కాలం పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
ఇక ఎన్నికలు పూర్తి అయిన కొంత కాలానికే బాలయ్య మళ్ళీ ఈ మూవీ షూటింగ్ పై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటివరకు ఈ మూవీ టైటిల్ను కానీ , విడుదల తేదీని కానీ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబి ఆఖరుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక మరోసారి తాను తెరకెక్కిస్తున్న సినిమాని సంక్రాంతి బరిలో నిలపాలి అనే ఆలోచనలో ఈ దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరి వాల్టేరు వీరయ్య మూవీ తో బ్లాక్ బాస్టర్ ను విజయాన్ని సొంతం చేసుకున్న ఈ దర్శకుడు బాలయ్య మూవీ తో కూడా అదే రేంజ్ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.