'దేవర' లో ఆ రోత డైలాగ్స్.. కొరటాల రైటింగ్ గతి తప్పుతుందా..?
ఇదిలావుండగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమా ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనిపించే టాక్ ను రాబట్టుకుంది. సోషల్ మీడియా లో వచ్చిన నెగిటివ్ టాక్ ను పక్కన పెడితే ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను రాబడుతుంది. అంతా బాగానే ఉంది కానీ ఓ విషయంలో మాత్రం కొరటాల బాగా డిజప్పాయింట్ చేశాడు అని చెప్పాలి. అదేంటంటే కొరటాల శివ సినిమాల్లో ఓ సామాజిక బాధ్యత కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు డిజైన్ చేస్తాడు.కథని ముందుకు నడిపించే విధంగానే కొరటాల సినిమాల్లో హీరోయిన్లు కనిపిస్తారు. ‘ఆచార్య’ లో హీరోయిన్ లేదు. పూజా హెగ్డే ఉన్నా లేనట్టే అయితే ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర కొంచెం వల్గర్ గా కనిపించింది అని అంతా అంటున్నారు.
ముఖ్యంగా హీరోయిన్ ఫ్రెండ్స్ పలికే డబుల్ మీనింగ్ డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే విధంగా ఉన్నాయి. ‘మామగారు తండ్రితో సమానం’ అని భావించే సంస్కృతి మనది.కానీ ఈ సినిమాలో హీరోయిన్ ‘మామగారిని పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ పలకడం’ ‘చాపెక్కిన ఏడాదికే పెళ్లి చేసుకున్నావ్. నీకేం తెలుస్తుంది మా అమ్మాయిల బాధ. అంటూ హీరోయిన్ ఫ్రెండ్స్ పలకడం చాలా ఘోరంగా ఉన్నాయి. నిజజీవితంలో రెస్పాన్సిబిలిటీస్ గురించి, జవాబుదారీతనం గురించి గొప్పగా చెప్పే కొరటాల పెన్ నుండి ఇలాంటి డైలాగులు రావడం నిజంగా విషాదకరమే అని చెప్పాలి.ఇదిలావుండగా ఇంతకు ముందు కూడా ఎన్నో పాన్ ఇండియా సినిమాలు మొదటి భాగం హిట్ అయిన తర్వాత రెండో భాగం విడుదల కోసం చాలా గ్యాప్ తీసుకున్నాయి. దాంతో కొన్ని సినిమాలపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కూడా పోయింది. ‘దేవర 2’ మాత్రం అలా జరగకుండా ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ‘దేవర’తో పాటు ‘వార్ 2’ షూటింగ్‌ను కూడా ఒకేసారి పూర్తిచేశాడు ఎన్‌టీఆర్. ఆ సినిమా షెడ్యూల్‌తో తనకు ఇంక ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాను నటించనున్న మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. దాని తర్వాత ఇంకా ఏ ప్రాజెక్ట్స్ ఓకే చేయలేదు కాబట్టి ‘దేవర 2’ స్టార్ట్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.