ఈ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన సినిమాలలో కల్కి 2898 AD , దేవర ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు సినిమాలలో మొదటి 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూవీ కి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. టోటల్ గా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాల్ని తెలుసుకుందాం.
విడుదల అయిన మొదటి రోజు కల్కి 2898 AD సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 38.09 కోట్ల కలెక్షన్లు వస్తే , దేవర సినిమాకి మొదటి రోజు 54.08 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
రెండవ రోజు కల్కి సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.08 కోట్ల కలెక్షన్లు దక్కితే , దేవర సినిమాకు 15.85 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
3 వ కల్కి సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 16.49 కోట్ల కలెక్షన్స్ దక్కితే , దేవర మూవీ కి 17.02 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
4 వ కల్కి మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21.85 కోట్ల కలెక్షన్లు దక్కితే , దేవర మూవీ కి 5.2 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
మొత్తంగా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కల్కి మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 93.41 కోట్ల కలెక్షన్లు దక్కితే , దేవర మూవీ కి 92.15 కోట్ల కలెక్షన్లు దక్కాయి. నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ కలెక్షన్లను బట్టి చూస్తే దేవర మూవీ పై కల్కి మూవీ పై చేయి సాధించింది. కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా ... నాగ్ అశ్విన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. దేవర మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.