ఏంటి నాగబాబు నిజంగానే పెళ్ళికి ముందే ఆ అమ్మాయిని ప్రేమించారా.. ఈ విషయం తెలిసి నాగబాబు భార్య పద్మజ అంత గొడవ చేసిందా.. ఇంతకీ నాగబాబు ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. నాగబాబు ప్రేమించారు అంటూ వస్తున్న వార్తలు నిజమే.కానీ ఆయనది వన్ సైడ్ లవ్.. అవును ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే బయట పెట్టారు. టీనేజ్ లో ఉన్న సమయంలో నాగబాబు చాలామందికి లైన్ వేసారట. కానీ ఒక్క అమ్మాయి కూడా నాగబాబుకి పడేది కాదట. దాంతో నాకేం తక్కువ అసలు నాకెందుకు అమ్మాయిలు పడడం లేదు అని తెగ బాధపడేవాడట. ఇక కొంతమంది అమ్మాయిలను ఫాలో చేసినప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి ధైర్యం లేక అక్కడి నుండి పారిపోయే వారట నాగబాబు.అంతేకాదు నాగబాబు ఇష్టపడిన చాలామంది అమ్మాయిలు తనకంటే మంచి వాడిని ఇష్టపడ్డారు కావచ్చు అనుకునేవాడట.
కానీ తీరా చూస్తే నాగబాబు కంటే వాళ్ళు ఎందులోనూ ఎక్కువగా ఉండేవారు కాదట. ఇక వారి టెస్ట్ బ్యాడ్ అని నాగబాబు అనుకునేవారట.
అయితే తాను ప్రేమించిన అమ్మాయిలు తనకంటే ప్రతి విషయంలో తక్కువ ఉన్నవాడిని ప్రేమించడంతో చాలా అసూయగా ఫీల్ అయ్యే వారట. ఇక ఎంతమంది అమ్మాయిలని ప్రేమించినా కూడా వారికి తన ప్రేమని వ్యక్తపరచడానికి ధైర్యం సరిపోయేది కాదట. దాంతో అన్ని భగ్న ప్రేమ కథలే అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఇక అమ్మాయిల విషయంలోనే కాదు ఫ్రెండ్స్ విషయంలో కూడా చాలా చిలిపి పనులు చేసేవారట..
టీనేజ్ లో ఉన్న సమయంలో ఇంగ్లీష్ సినిమాలకు వెళ్ళినప్పుడు కొన్ని సినిమాలు బాగో లేకపోయినా కూడా ఫ్రెండ్స్ కి అబద్దం చెప్పి ఆ సినిమా చాలా బాగుంది అని టికెట్ కి డబ్బులు పెట్టించి వాళ్లను కూడా ఇరికించాలని నాగబాబు ఎన్నో అల్లరి పనులు చేశారట.అలాగే తన గ్యాంగ్ లో ఓ ఫ్రెండ్ కమల్ హాసన్ లాగా డాన్స్ చేయడంతో ఆ డ్యాన్స్ చూసి అసూయగా ఫీలైన నాగబాబు చాలాసార్లు ఆ డ్యాన్స్ చెడగొట్టాడట.అలా టీనేజ్ లో ఉన్న సమయంలో ఎన్నో చిలిపి పనులు,అల్లరి పనులు చేశానంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటలన్నీ నాగబాబు తన కూతురు నిర్మాతగా తీసిన కమిటీ కుర్రోళ్ళు మూవీ 50 డేస్ సెలబ్రేషన్స్ లో భాగంగా బయటపెట్టారు