మణిరత్నం వల్ల అన్ని కోట్లు నష్టపోయిన దిల్ రాజు..?

Pulgam Srinivas
సినీ పరిశ్రమలో అందరి కంటే ఎక్కువ డేంజర్ జోన్లో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు అని చాలా సందర్భాలలో చాలా మంది చెప్పారు. ఎందుకు అంటే సినిమాలో నటించే నటీనటులు సినిమా హిట్ , ఫ్లాప్ తో సంబంధం లేకుండా వారి పారితోషకాలను వారు తీసుకుంటూ ఉంటారు. దానితో వారి కెరియర్ పెద్దగా డేంజర్ జోన్ లో ఉండదు . కొన్ని సినిమాల విషయంలో ఆర్థికంగా చాలా నష్టాలను ఎదుర్కొన్న స్టార్ హీరోలతో సినిమాలను చేసిన సందర్భంలో వారు ముందే సినిమాను అమ్మి వేస్తారు. అలాంటి సందర్భంలో వారికి నష్టాలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎటు తిరిగి సినిమాను చూడకుండా చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కొంటా ఉంటారు. అలాంటి వాటి వల్ల పెద్ద మొత్తంలో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. దానితో చాలా మంది కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ శాతం ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాలు కొలసాలగాలేరు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇకపోతే డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టి నిర్మాతగా అద్భుతమైన సక్సెస్ అయిన వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఓ సినిమా విషయంలో భారీ నష్టాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. దిల్ రాజు మాట్లాడుతూ ... కెరియర్ ప్రారంభంలో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సమయంలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన అమృత సినిమాను భారీ ధరకు కొనుగోలు చేశాము. ఇక సినిమా విడుదల అయ్యి ఫ్లాప్ అయ్యింది. ఆ మూవీ తో ఒక్క సారిగా నష్టాల్లోకి వెళ్లిపోయాము. అప్పటివరకు సంపాదించింది అంతా ఆ సినిమాలో పోయింది అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం దిల్ రాజు ఇటు డిస్ట్రిబ్యూటర్ గా , అటు నిర్మాతగా సక్సెస్ ఫుల్ గా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: