పెళ్లయిన స్టార్ హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. చివరికి ఆ హీరోయిన్ కు మిగిలింది ఇదే..!

Amruth kumar
చిత్ర పరిశ్రమ ఇదొక మహాసముద్రం.. ఇందులో వేలాది మంది కళామతల్లిని నమ్ముకుని ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అవకాశాలు అందుకున్న వారు నటులుగా, రైటర్లుగా డైరెక్టర్లుగా  రాణిస్తున్నారు. కలిసి రానివారు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరికొందరు కాలం కలిసి రాలేదని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక చిత్ర పరిశ్రమలో ఎవరి జీవితం ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. మరి ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే ఎన్నో అవ‌మానాలు ఉంటాయి. రంగుల ప్రపంచంలో రాణించాలని సంతూర్లను, ఇంట్లో వాళ్లను ఎదిరించి ఇండస్ట్రీకి వస్తున్నారు. టాలెంట్ ఉన్నవారు అవకాశాలను అందుకుంటున్నారు. కొన్ని అనుకోని సమయంలో లేనిపోని కష్టాలకు ఎదురు వెళ్తున్నారు. ఇలా ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చి తిరుగులేని స్టార్‌ గా ఎదిగిన సారిక తర్వాత కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది
సారిక అంటే ఇప్పటి వారికి తెలియదు కానీ అప్పటి తరానికి ఆమె  కలల రాకుమారి.. అప్పట్లో ఆమె క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. ఐదేళ్ల వయసు నుంచి సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది.. చిన్న వయసులోనే ఇంటిలో గొడవలు కారణంగా తండ్రి ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబానికి సారిక వెన్నుముకగా మారారు.. 1967లో ఇండస్ట్రీలోకి వచ్చిన సారిక ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు. 80వ దశకంలో ఆమె ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా ఏలింది. అదే సమయంలో అప్పటికే ఇండస్ట్రీలో బిగ్ స్టార్ గా ఉన్న కమలహాసన్తో రిలేషన్ లో ఉంది.
అయితే కమల్‌కు అప్పటికే పెళ్లయింది.. అయినా సరే ఇద్దరూ కొన్ని సంవత్సరాలు పాటు డేటింగ్ లో ఉన్నారు. దీంతో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఉన్న శృతిహాసన్ పెళ్లికి ముందే జన్మించింది. పాప పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత కమల్ తన భార్యకు విడాకులు ఇచ్చి సారికను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వీరికి అక్షర హాసన్ జన్మించింది. ఇక కమల్ సారిక 16సంవత్సరాలు కలిసి కాపురం చేశారు. 2004లో వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత కమల్ మరో నటి గౌతమిని పెళ్లి చేసుకున్నాడు. సారిక వాంటెడ్ చేయటం గడుపుతుంది తమిళంలో సారక్క కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది అంతలో ఒకటి కమలహాసన్తో చేసినన టిక్ టిక్ టిక్.. ఈ సినిమా తర్వాతే వీరి మధ్య రిలేషన్ మొదలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: