నానిని చూసి నేర్చుకోవాలి భయ్యా.. నార్త్ ఇండియాను ఊపేస్తున్నాడుగా..!!
నేచురల్ స్టార్ నాని తన సినిమాల డబ్బింగ్ వర్క్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాడు. అంటే, సినిమాలోని మాటలను మరో భాషలోకి అనువదించే పనిని చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేయిస్తున్నాడు. దీని వల్ల సినిమా ఎక్కడ విడుదలైనా అది అక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. డబ్బింగ్ బాగుంటే ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే డబ్బింగ్ చెత్తగా ఉంటే ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేదు ఈ విషయాన్ని నాని బాగా అర్థం చేసుకున్నాడు.
కొన్ని సినిమాలు థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఆయన తాజా సినిమాలు ఓటీటీలో అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. దీనికి కారణం ఆయన చేసే ప్రమోషన్లు మంచివిగా ఉండటమే కాకుండా, ఆయన సినిమాలు ఎవరికైనా నచ్చేలా రూపొందించడం.
నాని తన సినిమాలు ఒక్క తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ కి కూడా నచ్చేలా చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. తన సినిమాల్ని బాగా ప్రచారం చేయడం వల్ల, ఆయన లేటెస్ట్ సినిమా 'సరిపోదా శనివారం' ఇప్పుడు దేశం మొత్తం ట్రెండ్ అవుతోంది. తెలుగు సినిమా ఇంత పెద్ద స్థాయిలో హిట్ అవ్వడం చాలా అరుదు. ఓటీటీల్లో కూడా నాని సినిమాలు బాగా ఆడుతున్నాయి కాబట్టి, ఉత్తర భారతదేశంలో ఆయనకు మంచి గుర్తింపు వస్తుంది. ఇలా ఎప్పుడూ కష్టపడితే విజయం లభిస్తుందని నాని చూపిస్తున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్, తారక్, ప్రభాస్ లాంటి హీరోలు ఒకట్రెండు సినిమాలతో నార్త్ ఇండియాలో బాగా క్రేజీ తెచ్చుకుంటున్నారు తర్వాత ఆ స్టార్డం అక్కడ పెట్టుకోలేకపోతున్నారు వారి సినిమాలు అక్కడ పెద్దగా ఆడటం లేదు. వాళ్లు కూడా నానిని చూసి నేర్చుకుని, తమ సినిమాలను బాగా ప్రమోట్ చేసుకుంటే అక్కడ కూడా తమ మూవీల మార్కెటు బాగా పెంచుకోవచ్చు.