రాత్రి సమయాలలో పెరుగు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?

Divya
రాత్రి సమయాలలో భోజనం తినే సమయంలో చాలామందికి కచ్చితంగా పెరుగన్నం లేకపోతే పెరుగు తినడానికే మక్కువ చూపుతూ ఉంటారు. అయితే ఇలా రాత్రిపూట పెరుగు తినడం వల్ల చాలా ప్రమాదమని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. వాటి గురించి చూద్దాం.

ఎక్కువగా పెరుగు తింటే కచ్చితంగా జలుబు చేస్తుందని లేకపోతే అధిక బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది పెరుగు ఎక్కువగా తినడం వల్ల అవసరమైన పోషకాలు లభిస్తాయని దీంతో ఎక్కువ కాలం బతికేస్తారనే విధంగా కూడా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పెరుగులో క్యాల్షియం ,మెగ్నీషియం, విటమిన్స్ వంటివి ఉండడమే కాకుండా బ్యాక్టీరియాని కూడా చాలా సమృద్ధి చేస్తాయి. పెరుగు జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడానికి మలబద్ధక సమస్యను సైతం తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

రోజు పెరుగు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ మూత్రపిండాల వ్యాధులను సైతం అదుపులో ఉంచడమే కాకుండా రక్తంలో ఉండే గ్లూకోజ్లను తగ్గించి మరి సరఫరా చేస్తుండట.

ఎవరైతే ఫిట్నెస్ బాడీని మెయింటైన్ చేయాలనుకున్నారో వ్యాయామం చేసిన తర్వాత ప్రతిరోజు ఒక గ్లాసు పెరుగుని తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్ల ఫలితం వల్ల శరీరాకృతిని మార్చుకోవచ్చు.

ప్రతిరోజు పెరుగు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతున్నప్పటికీ రాత్రి సమయంలో మాత్రం పెరుగుని తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయట. ముఖ్యంగా పెరుగులో ఉండే టైరామైన్ కంటెంట్ నిద్ర పోనివ్వకుండా చేస్తుందట అలాగే నిద్రలేని సమస్యలను కూడా రావడానికి కారణమవుతుందట పెరుగు. కొంతమంది పెరుగు తినడం వల్ల దగ్గు జలుబు సమస్యలు అధికంగా వస్తాయి అలాగే ఇందులో ఉండే అధిక కొలెస్ట్రాల్ వల్ల కీళ్ల నొప్పులు కూడా వస్తాయట. ముఖ్యంగా జీర్ణ క్రియ శక్తి బలహీనంగా ఉన్నవారు రాత్రి సమయాలలో కర్డ్ రైస్  కాని పెరుగును కాని తినకపోవడమే మంచిది. మొత్తానికి రాత్రి సమయాలలో తినడం కంటే పగటిపూటే తినడం మంచిదని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: