టాలీవుడ్ లోనే అత్యధిక థియేటర్స్ లో ఆడిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఇదే..!

Amruth kumar
ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక్క సినిమా మూడు రోజులు ఆడటం అంటే చాలా గొప్ప విషయం.. అలాంటిది 100 రోజులకు పైన ఆడటం మంటే ఎంతో కష్టమనే చెప్పాలి. కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమలో 50 రోజులు, 100 రోజులు, 1000 రోజులకు పైగా ఆడిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రజెంట్ ఓటీటీ కాలంలో సినిమాల పరిస్థితి ఎంతో దారుణంగా మారిపోయింది. ప్రస్తుతం సినిమా టికెట్లు రేట్లు పెరగటం వల్ల అన్ని కోట్ల కలెక్షన్ రాబాటిందని చెప్తున్నారు కానీ.. మన పాత రోజుల్లో సినిమా రికార్డులను అవి ఆడిన థియేటర్ల బట్టి లెక్కలను వేసేవారు. దాన్నిబట్టి అది ఇండస్ట్రీ హిట్టా లేదా అని చెప్పేవాళ్ళు. ఇక మన టాలీవుడ్ లో 175 రోజుల కంటే ఎక్కువ థియేటర్లో ఆడిన సినిమాలు ఉన్నాయి. అలా ఎక్కువ రోజులు థియేటర్లో ఆడిన టాప్ 10 సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.
సింహాద్రి:
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా సింహాద్రి. ఈ సినిమా 2003లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఆ రోజుల్లో 175 సెంటర్లో వంద రోజులకు పైగా ఆడి... 52 సెంటర్లో 175 రోజులను పూర్తి చేసుకుని.. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
పోకిరి:
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా పోకిరి.. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే ఆల్ టైం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 200 సెంటర్లో  100 రోజులు ఆడింది.. 48 సెంటర్లో 175 రోజులకు పైగా ఆడి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఇంద్ర:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి. గోపాల్ డైరెక్షన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా ఇంద్ర.. ఈ సినిమా 2002లో విడుదలై చిరంజీవికి అదిరిపోయే హిట్ ఇచ్చింది.. ఈ సినిమా ఆ రోజుల్లో ఏకంగా 122 సెంటర్లో 100 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా... 31 కేంద్రాల్లో 175 రోజులకు పైగా ఆడి.. చిరంజీవి కెరీర్ లోనే ఆల్ టైం హిట్‌గా నిలిచింది.
సమరసింహారెడ్డి:
నందమూరి బాలకృష్ణ హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సినిమా సమరసింహారెడ్డి... ఈ సినిమా 1999లోవిడుదలై బాలకృష్ణకు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా ఏకంగా ఆ టైంలో 29 కేంద్రాల్లో 175 రోజులకు పైగా ఆడింది.
పెళ్లి సందడి:
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన సినిమా పెళ్లి సందడి.. ఎలాంటి అంచనాలు లేకుండా 1996లో విడుదలైన ఈ సినిమా శ్రీకాంత్ కు ఆల్ టైం హిట్ సినిమాగా నిలిచింది.. ఈ సినిమా ఆ రోజుల్లో ఏకంగా 27 థియేటర్లలో 175 రోజులకు పైగా ఆడింది.
నువ్వే కావాలి:
తరుణ్ హీరోగా విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా నువ్వే కావాలి..సినిమా 2000వ‌ సంవత్సరంలో విడుదలై తరుణ్ కు అదిరిపోయే హిట్ నచ్చింది.. ఈ సినిమా ఆ టైంలోనే 20 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా 25 సెంటర్లో 175 రోజులు ఆడి ఆల్ టైం రికార్డ్ గా నిలిచింది.
ప్రేమాభిషేకం:
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రేమాభిషేకం.. 1981లో విడుదలైన ఈ సినిమా ఆ రోజుల్లోనే 19 కేంద్రాల్లో రజితోత్సవం జరుపుకుంది.
నరసింహనాయుడు:
బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన మరో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు.. 2001లో విడుదలైన ఈ సినిమా 17 థియేటర్లలో 175 రోజులకు పైగా ఆడి బాలకృష్ణకు మరో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
కలిసుందాం రా:
విక్టరీ వెంకటేష్ హీరోగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా కలిసుందాం రా...2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే అదిరిపోయే హిట్ సినిమాగా నిలిచింది.. ఈ సినిమా 14 సెంటర్ల 175 రోజులు ఆడింది.
లవకుశ:
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా లవకుశ.. 1963 లో మొదటి కలర్ సినిమాగా వచ్చిన  లవకుశ ఆ రోజుల్లోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది.. 13 సెంటర్లో 175 రోజులకు పైగా ఆడి.. ఎన్టీఆర్ రికార్డులను ఎన్టీఆర్ తిరగరాసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: