తిరుపతి లడ్డుతో పవన్- కార్తీ.. అదిరిపోయే గేమ్ ఆడారుగా..!

Amruth kumar
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. అందులో కల్తీ నెయ్యి ఉపయోగించారని, ఆయన నెయ్యిలో పందికోవు, జంతువుల మాంసంతో తయారుచేసిన నూనె లాంటి పదార్థాలు క‌లిపారు అంటూ దుమారం రేగుతుంది. గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన ల్యాబ్ కు పంపక నెయ్యి కలితి అయినట్లు రిపోర్ట్‌లు వచ్చాయి. ఇక దీంతో దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హిందూ ధర్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేపట్టారు. అదేవిధంగా విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లను శుభ్రం చేయడంతో పాటు తిరుమలకు న‌డుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురకు మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇదే క్ర‌మంలో సత్యం సుందరం మూవీ ప్రమోషన్స్ లో హీరో కార్తీ ని విలేకరులు లడ్డుపై ప్రశ్నించగా అది సున్నితమైన అంశం అని స్పందించేందుకు నిరాకరించాడు. అయితే ఆయన ఆ సమాధానాన్ని నవ్వుతూ చెప్పాడు.  అయితే అదే సమయంలో లడ్డూను అపహస్యం చేస్తూ సమాధానం చెప్పారని భావించిన పవన్, కార్తీపై మండిపడ్డాడు. ఇక వెంటనే కార్తి క్షమాపణలు చెప్పారు. ఇదే క్రమంలో అనవసరమైన విషయానికి కార్తీ చేత క్షమాపణలు చెప్పించారంటూ  కోలీవుడ్ మీడియ మండిపడింది.
అయితే ఈ విషయాన్ని ప్రచారం కోసం వాడుకున్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై వీరిద్దరి మధ్య రేగిన దుమారం వల్ల సత్యం సుందరం సినిమాకు మంచి ప్రచారం వస్తుందని కార్తీ భావించారు. తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఏ సందర్భంగా కార్తీ అలా మాట్లాడారనేది తనకు అర్థమైందని, సినిమా బాగా ఆడాలంటూ విషెస్ చెప్పారు. పవన్ ట్వీట్ చేసిన వెంటనే కార్తీ స్పందించడంవల్ల సామాజిక మాధ్యమాలతోపాటు తెలుగు, తమిళంలో అతనిపై, అతని సినిమాపై పాజిటివిటీ బాగా పెరిగింది. అది సత్యం సుందరం సినిమాకు ఉపయోగపడింది. ఇప్పటికే తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని సనాతన ధర్మంతో ముడిపెట్టి రాజకీయాలు చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: