సరైన బేస్‌ లేకున్నా...టాలీవుడ్‌ ను షేక్‌ చేస్తున్న నాని ?

Veldandi Saikiran

* అసిస్టెంట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ
* అష్టాచెమ్మాతో  నటుడిగా గుర్తింపు
* అలా మొదలైందితో స్టార్డమ్ తెచ్చుకున్న  నాచురల్ స్టార్
* నిర్మాతగా, సహదర్శకుడిగా  దూసుకుపోతున్న నాని

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన హీరోలు చాలానే మంది ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చారని చెబుతూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి తో పాటు చాలామంది హీరోలు కష్టపడి పైకి వచ్చిన వారే ఉన్నారు. అలాంటి వారిలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. న్యాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి నేచురల్ స్టార్ నాని చాలా కష్టపడ్డాడని చెప్పవచ్చు. ఎన్నో ఒడిదుడుకులు  ఎదుర్కొని మరి సక్సెస్ కాగలిగాడు. ఇండస్ట్రీలో ఓ నటుడిగా  సక్సెస్ అయ్యేందుకు.. చాలామంది చేతిలో మోసపోయాడు.  డబ్బులు ఇచ్చి కూడా నాని మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక చివరికి బాపు దగ్గర అసిస్టెంట్ గా .. చేరిన నాని...ఆ తర్వాత రాజమౌళి చెంతకు కూడా చేరారు. ఈ తరుణంలోనే అష్టా చమ్మా సినిమాలో నటించారు నాని.
 

ఈ సినిమా అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. ఇందులో నాని యాక్టింగ్ నచ్చి చాలామంది మెచ్చుకున్నారు. ఆ తర్వాత... అలా మొదలైంది సినిమాతో... తన కెరీర్ను ఓ  రేంజ్ కి తీసుకుపోయాడు నాని.  ఈ తరుణంలోనే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో... ఈగ సినిమా చేసి...  మళ్లీ బంపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిపోయారు నాని.

అయితే ఈగ సినిమా సక్సెస్ అయిన తర్వాత వరుసగా ఫ్లాఫ్ లను అందుకున్న నాని... 2017లో బలే బలే మగాడివోయ్ సినిమాతో మళ్లీ సక్సెస్ రూట్ లోకి వెళ్లాడు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాతో మళ్లీ ఇండస్ట్రీని షేక్ చేశాడు నాని. లేటెస్ట్ గా టక్ జగదీష్, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం లాంటి సినిమాలను కూడా సక్సెస్ చేసుకున్నాడు. ప్రస్తుతం హిట్ పార్ట్ 3 లో నటిస్తున్నాడు. హిట్ ప్రాజెక్టుకు నిర్మాతగా కూడా నాని  ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: