బ్రేక్ ఈవెన్ దాటేసింది.. అక్కడ దేవర సేఫ్?
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన దేవర సినిమా థియేటర్లలో అలజడి సృష్టిస్తుంది. నిన్న మొదటి షోతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దేవర సినిమా, సాయంకాలానికి యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు తీవ్రమైన నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో దర్శకుడు కొరటాల శివపై అనేకమంది విమర్శలు గుప్పించారు. మొదటి పార్ట్ సినిమానే సరిగ్గా తెరకెక్కించలేని కొరటాల, రెండో సినిమాను ఎలా తీయగలరు? అన్న విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తాజాగా ఒక విషయం దేవర చిత్ర యూనిట్ కి కాస్త ఊరట కలిగిస్తోందని చెప్పుకోవాలి.
విషయం ఏమంటే దేవర సినిమా రిలీజ్ కి ముందే అమెరికాలో రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అక్కడ రికార్డు స్థాయి వసూళ్లు సినిమా రాబట్టిందని విశ్లేషకులు అంటున్న మాట. ఇక అసలు విషయంలోకి వెళితే, యూఎస్ గడ్డపైన దేవర సత్తా చాటుతో ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా నాలుగు మిలియన్ల డాలర్లు వసూళ్లు చేసి, బ్రేక్ ఈవెన్ సాధించినట్టు సమాచారం. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే, 33 కోట్లు సాధించినట్టు లెక్క!
ఇక ఈరోజు రేపు కూడా వీకెండ్ కావడంతో ఆయా వసూళ్లు మరింత పెరిగిపోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అన్నిటికంటే శుభవార్త ఏమిటంటే, దేవర సినిమా మొదటి రోజే ఎవ్వరు ఊహించలేని విధంగా, 178 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది. సినిమా మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ కూడా, ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి అని, ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యావత్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కెరియర్ లో ఇలా మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇదే అని సమాచారం. అయితే నార్త్ సర్కిల్స్ లో మాత్రం దేవర సినిమా అంతంత మాత్రంగానే ఆడుతున్నట్టు తెలుస్తోంది. మొదటి రోజు ఎక్కడ కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమే వసూలు అయింది. అయితే ఓవరాల్ గా ఇప్పటికి 400 కోట్లకు పైగా బిజినెస్ చేయడంతో దేవర సినిమా సేఫ్ జోన్ లో ఉన్నట్టు లెక్కల పండితులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు!