మరోసారి పూనమ్ కౌర్ సెటైరికల్ ట్వీట్.. ఎవరికో..?

Divya
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి  చెప్పాల్సిన పనిలేదు.. పంజాబీ ముద్దుగుమ్మ అయినప్పటికీ టాలీవుడ్లో పలు చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది.. అయితే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పేరుపై  నిరంతరం పోస్టులు షేర్ చేస్తూ వివాదాలలో ఈమె పేరు వినిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలనైనా సరే ధైర్యంగా తెలియజేస్తూ ఉంటుంది పూనమ్ కౌర్. ఆ టాలీవుడ్ డైరెక్టర్ నే కాకుండా బడా హీరోలను కూడా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల తిరుపతి లడ్డు వివాదంలో కూడా పూనమ్ కౌర్ తన ట్విట్టర్ నుంచి చేసిన ఘాటు వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

హిందూ మతాన్ని స్వలాభం కోసమే ఉపయోగించడం వేరు.. హిందూ మతాన్ని నమ్మే వ్యక్తిగా ఉండడం వేరు అనే విధంగా ఒక కొటేషన్ ని షేర్ చేసింది పూనమ్ కౌర్.. అయితే ఈమె ఇది ఎవరిని ఉద్దేశించి షేర్ చేసిందా అనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్నాయి.. ముఖ్యంగా ఒక బడా హీరో పొలిటికల్ నేతని టార్గెట్ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పూనమ్ ఎలాంటి ట్వీట్ చేసినా కూడా ఒక వర్గం అభిమానులు ఎప్పుడూ కూడా స్పందిస్తూ ఉంటారు. దీనిపైన పలు రకాల సెటైరికల్ కౌంటర్లు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి.

సినిమాలలో కంటే ఎప్పుడూ కూడా వివాదాలలోనే తలదురుస్తూ ఉంటుంది పూనమ్.. గతంలో ఇమే చేనేత వస్త్రధారణ వంటి సంబంధించిన వాటిలో భాగంగా కూడా ఉండేది. ఈమధ్య పొలిటికల్ప రంగా యాక్టివ్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ నిరంతరం ఏదో ఒక విషయంలో మాత్రం వైరల్ గా ఈమె పేరు వినిపిస్తూ ఉంటుంది. అయితే అభిమానులు మాత్రం ఈమెను సినిమాలలో నటించమంటూ కోరుతూ ఉన్నారు. మరి పూనం కౌర్ చేస్తున్న ఈ సంచన ట్విట్ ఎప్పటికీ పుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: