డల్లాస్‌లో దేవర ఫ్యాన్స్ రచ్చ.. ఆ షోతో షేక్ చేశారుగా...

Suma Kallamadi
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ ఫిలిం 'దేవర - పార్ట్ 1' రిలీజ్ కావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆయన చివరిగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు చేసి అదరగొట్టాడు మళ్ళీ ఇప్పుడు అంతకుమించిన యాక్షన్స్ సన్నివేశాలతో దేవర సినిమా వస్తోంది. కాబట్టి, ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు.
‘దేవర’ సినిమా చాలా రోజులు వెయిట్ చేయి చివరికి రిలీజ్ కు సిద్ధం కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కొందరు అభిమానులు చాలా క్రియేటివ్‌గా ఈ సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని డల్లాస్‌ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం స్పెషల్‌గా ఒక స్పెషల్ షో నిర్వహించారు. అక్కడ ‘టెస్లా’ కార్లతో ఒక లైట్ షో ఏర్పాటు చేసి, సినిమాలోని ‘ఫియర్ సాంగ్’కు అనుగుణంగా లైట్లు టర్న్ ఆన్ చేశారు. ఈ షోలో ‘ఎన్టీఆర్’ అనే పదం అద్భుతంగా వెలిగిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'దేవర'లో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. మన తెలుగు నటులైన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే సూపర్ హిట్. ఈ సినిమా గురించి మరింత సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ వెబ్‌సైట్‌ను విజిట్ చేస్తూ ఉండొచ్చు.
హాలీవుడ్ సినిమాలకు సమానమైన వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. రేపొద్దున్నే సినిమా చూడగానే చాలామంది మూవీ ఎలా ఉందనేది చెబుతారు. అప్పుడే ఎన్టీఆర్ దేవర మూవీ రిజల్ట్ తెలిసిపోతుంది. కొరటాల శివ ఆచార్య సినిమాతో డిసప్పాయింట్ చేశాడు. ఈ సినిమా హిట్ అయితే ఆ ఫ్లాపు నుంచి అతను బయటపడతాడు. మరింత మంది స్టార్ హీరోలతో కలిసి సినిమా చేసే అవకాశం ఉంటుంది.
https://x.com/DevaraMovie/status/1839151085577241077?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1839151085577241077%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.123telugu.com%2Fmnews%2Fdevara-hype-soars-dallas-fans-dazzle-with-tesla-light-show.html

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: