తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవితో సినిమా అంటే చాలా మంది దర్శకులు ఎగిరి గంతేసి ఒప్పుకుంటూ ఉంటారు. కానీ ఓ దర్శకుడు మాత్రం ఆయనతో సినిమా అంటే భయపడ్డాడట. ఆ దర్శకుడు ఎవరు..? ఎందుకు భయపడ్డాడు అనే వివరాలు తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ వీరందరితో సినిమాలు చేసి అందరితో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు.
మరి ముఖ్యంగా ఈయన చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ లకు బ్లాక్ బాస్టర్ విజయాలను అందించాడు. ఇంత గొప్ప ట్రాక్ రికార్డు కలిగిన ఈయన చిరంజీవితో సినిమా అంటే మాత్రం భయపడ్డాడట. అది ఎందుకు అనుకుంటున్నారా ..? చిరంజీవి తో మెకానిక్ అల్లుడు అనే సినిమాను గోపాల్ రూపొందించాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆయనకు అశ్వినీ దత్ బ్యానర్లో చిరుతో మూవీ అవకాశం వచ్చింది. ఇక ఆయన చిరంజీవితో మూవీ కోసం చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథను విన్నాడట. కానీ ఆ కథ ఆయనకు నచ్చలేదు. దానితో ఆయన చిరంజీవితో సినిమా చేయకూడదు అనుకున్నాడట.
దానికి ప్రధాన కారణం ఆయన అప్పటికే సమరసింహా రెడ్డి నరసింహనాయుడు అనే ఫ్యాక్షన్ సినిమాలను చేసి ఉండడం , చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథ కూడా దాదాపుగా అలాగే ఉండడంతో మరో సారి ఏదైనా తేడా కొట్టి మెకానిక్ అల్లుడు లా ఈ సినిమా ఫ్లాప్ అయితే బాగుండదు. చిరంజీవికి కచ్చితంగా హిట్ ఇవ్వాలి. ఇలాంటి సినిమా చేయకూడదు అని ఆయన భయపడ్డాడట. కానీ చివరకు చిరంజీవి తో చిన్ని కృష్ణ కథతో ఇంద్ర మూవీ ని రూపొందించి ఇండస్ట్రీ హిట్ ను గోపాల్ కొట్టాడు.