దేవర:హైప్ ఎక్కిస్తున్న కొరటాల శివ.. దేవర గురించి తెలియని విషయాలు..!

Divya
డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో రెండు రోజులలో దేవర సినిమా రాబోతోంది. గతంలో రచయితగా బృందావనం సినిమాకి పనిచేసిన కొరటాల శివ , ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ కాబోతోంది. ఇలాంటి సందర్భంలో డైరెక్టర్ కొరటాల శివ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ పలు విషయాలను తెలియజేశారు.
యాంకర్ ఇలా అడుగుతూ విడుదల తేదీ దగ్గర పడుతుంది కదా టెన్షన్ లేదా అంటూ అడగగా.. కొరటాల శివ కొద్దిపాటి టెన్షన్ అయితే ఉంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎప్పుడు అందరికీ వచ్చే ఫీలింగే ఇప్పుడు అంటూ తెలిపారు.
దేవర సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఎన్టీఆర్ ఏమన్నారు అని అడగగా.. కొరటాల శివ మాట్లాడుతూ . ఎన్టీఆర్ తో తన ప్రయాణం ఎప్పుడూ చాలా ప్రత్యేకమని.. ఎన్టీఆర్ రియాక్షన్ కూడా చాలా బలంగానే ఉంటుంది అంటూ తెలిపారు. ఎలాంటి విషయాన్నైనా సరే డైరెక్ట్ గానే చెబుతారని తెలిపారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్సైట్మెంట్ తనను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్లిందని తెలిపారు.
ఎన్టీఆర్ కోసమే డ్యూయల్ రోల్ రాశారా లేకపోతే తండ్రి పాత్రలు అనుకొని రాశారా అని యాంకర్ అడగగా.. కొరటాల శివ మాట్లాడుతూ.. కేవలం ఎన్టీఆర్ ను  దృష్టిలో పెట్టుకోని ఇలాంటి క్యారెక్టర్లు క్రియేట్ చేశానని,  వర అనే క్యారెక్టర్ దేవర సినిమాలో చాలా కీలకమని.. రెండవ భాగంలో మరింత హైలెట్ అవుతుందంటూ తెలిపారు. అలాగే ఎన్టీఆర్ నటించిన గత సినిమాలలో కంటే ఇది పెద్ద కథ అంటే తెలిపారు.
దేవర రెండు భాగాలు ఏ స్టేజిలో వుంటాయని అనుకున్నారని అడగగా.. కొరటాల శివ మాట్లాడుతూ..  ఎన్టీఆర్ కు  నాలుగు గంటల పాటు కథ చెప్పానని,  అయితే ఈ స్టోరీనే పేపర్లో పెట్టినప్పుడు 7 గంటల పాటు వస్తుందని,  ఇంత సినిమా చెప్పగలనా అనే సందేహం కూడా వచ్చిందని తెలిపారు. కానీ మొదట రెండు భాగాలు వద్దనుకున్నాము అలాగే సినిమాను కూడా మొదలుపెట్టాము కానీ చివరికి మాకు అర్థమైనది ఏమిటంటే రెండవ పార్ట్ కూడా కావాలని గ్రహించిన వెంటనే రెండో పార్ట్ గురించి అనౌన్స్మెంట్ చేసామని తెలిపారు.
RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి ఎందుకు అంత సమయం అని అడగగా.. ఈ సినిమా మొత్తం సముద్రం బ్యాక్ డ్రాప్ లోనే చేసాము. సముద్రం మీద ఎలా షూటింగ్ చేయాలి. లేకపోతే మనమే సముద్రాన్ని క్రియేట్ చేయాలా..?  లైటింగ్ ఎలా ఉండాలి అని అన్ని వేరియేషన్ లలో సినిమాని తెరకెక్కించాలనుకున్నాము. అందుకే ఆరు నెలలు దీనికే పని చేశామంటూ తెలిపారు. అలాగే దేవరా సినిమాకి మొదటిసారి హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పనిచేశాము మన వాళ్ళతో కూడా పనిచేశాము.. హాలీవుడ్ టెక్నీషియన్స్ కు ప్రతి చిన్న విషయాలు కూడా చెప్పాలి కానీ మన టెక్నీషియన్స్ కి అలా చెప్పాల్సిన పనిలేదు తక్కువ టైం లోనే ఎక్కువ ప్రిపరేషన్ చేస్తారని తెలిపారు. కానీ హాలీవుడ్ వాళ్లు మాత్రం చాలా ఇబ్బందులు పడతారని తెలిపారు కొరటాల శివ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: