అక్కడ దేవర ఏకంగా 3 గంటల 10 నిమిషాలు.. కారణం ఏంటో తెలుసా..?

Pulgam Srinivas
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులను ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే పూర్తి చేశారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఇక సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన రోజే ఈ మూవీ కి సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీ 2 గంటల 57 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

దానితో ఈ సినిమా దాదాపు 3 గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా కథలో , కథనంలో బలం ఉంటే ఏమీ కాదు కానీ , ఏ కాస్త సినిమా కథ వీక్ ఉన్నా కూడా మూడు గంటల రన్ టైమ్ ఈ మూవీ కి మైనస్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అనే వార్తలు వచ్చాయి. ఇక దానితో వెంటనే చేరుకున్న ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క రన్ టైమ్ ను తగ్గించినట్లు ప్రస్తుతం ఈ సినిమా 2 గంటల 42 నిమిషాల రన్ టైమ్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఓ ప్రాంతంలో మాత్రం ఈ సినిమా ఏకంగా 3 గంటల 10 నిమిషాల నిడివి తో రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా యొక్క ఐమాక్స్ ప్రింట్ 3 గంటల 10 నిమిషాల రన్ టైమ్ తో రానున్నట్లు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రింట్ ను కూడా మూవీ మేకర్స్ పంపి వేసినట్లు తెలుస్తోంది. అలా ఈ మూవీ ని ఎవరైతే ఐమాక్స్ థియేటర్లలో చూస్తారో వారికి ఈ సినిమా 3 గంటల 10 నిమిషాల నిడివితో అందుబాటులోకి రాబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: