సినిమా ఇండస్ట్రీలో ఒకే సమయంలో ఒకే లాంటి కథతో సినిమాలు రూపొందించినట్లు అయితే గతంలో అలాంటి కథ తోనే సినిమా వచ్చింది మళ్ళీ ఈ సినిమా ఎందుకు తీశారు అని నెగటివ్ టాక్ రావడం , అలా వచ్చే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి "ఇంద్ర" మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను కొట్టిన నెలకొల్పిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలో ఒక పెద్ద చర్చ నడిచిందట. అదేంటో తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా అశ్విని దత్ ఒక మూవీ ని తీయాలి అని అనుకున్నాడట. దానికి బి గోపాల్ ను దర్శకుడిగా ఎంచుకున్నాడట.
ఇక చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది దానితో సినిమా చేయండి అని బి గోపాల్ కి సూచించాడట. ఆయన కథ మొత్తం విని అది నాకు నచ్చలేదు చేయను అన్నాడట. దానితో పరుచూరి గోపాలకృష్ణ ఒక రోజు గోపాల్ ను కలిసి నువ్వు ఎందుకు ఆ సినిమా చేయనన్నావు అన్నాడట. దానితో ఆయన నేను ఆల్రెడీ సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేశాను. చిన్ని కృష్ణ చెప్పిన కథ కూడా ఫ్యాక్షన్ స్టోరీనే. ఇప్పటికే నేను చిరు తో మెకానిక్ అల్లుడు సినిమా చేసి ఫ్లాప్ అందుకున్నాను. మళ్ళీ అతనితో అలాంటి అనుభవం ఎదుర్కోలేను.
అందుకే చేయను అన్నాడట. దానితో పరుచూరి గోపాలకృష్ణ నువ్వు బాలకృష్ణ తో చేసావు , చిరంజీవితో కాదు. చిరు తో ఈ కథ చాలా ఫ్రెష్ గా ఉంటుంది అన్నాడట. దానితో ఆయన కన్విన్స్ కావడం , ఈ సినిమా చేయడం జరిగిందట. అలా సేమ్ స్టోరీ అని వద్దనుకున్న మూవీ తో చిరంజీవి కి ఏకంగా బి గోపాల్ టాలీవుడ్ ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హీట్ ను ఇచ్చాడు.