అక్కినేని అనే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. నాగచైతన్య రెమ్యూనరేషన్ అంత తక్కువా?
ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం భారీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోలందరూ కూడా వందల కోట్ల పారితోషకాన్ని తీసుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. ప్రభాస్ ఏకంగా ఒక్కో సినిమాకి 150 కోట్లు తీసుకుంటుంటే.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి ఇతర స్టార్ హీరోలు 100 కోట్ల వరకు పారితోషకం పుచ్చుకుంటున్నారు అన్నది తెలుస్తుంది. ఇంకోవైపు మహేష్ బాబు కూడా భారీ మొత్తం లోనే పారితోషకం తీసుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే అక్కినేని అనే భారీ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన నాగచైతన్య మాత్రం ఇంకా స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు.
కెరీయర్ని నిలబెట్టుకునేందుకు ఇంకా ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నాడు. ఇలాంటి అక్కినేని హీరో కనీసం తన తండ్రి రేంజ్ లో కూడా పారితోషకం తీసుకోవట్లేదట. నాగార్జున ఒక్కో సినిమాకి 20 నుంచి 30 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంటే అటు అక్కినేని నాగచైతన్య మాత్రం 10 నుండి 15 కోట్ల వరకు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అంతేకాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఏకంగా ఒక్కో ఎండార్స్మెంట్ కి రెండు కోట్ల వరకు వసూలు చేస్తూ ఉంటాడట. అయితే అక్కినేని అనే బడా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చి కూడా నాగ చైతన్య ఇంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అన్న విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.