వావ్: ఈ ఏడాది మెగా ఫ్యాన్స్ కు డబుల్ గుడ్ న్యూస్.. మెగాస్టార్ కి అక్కడ చోటు..!

Divya
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన స్వయంకృషితో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నారు.. చిరంజీవికి అవార్డులు అందుకోవడం పెద్దకొత్త ఏమి కాదు.. ఎన్నో అవార్డులు అందుకోవడమే కాకుండా పద్మ విభూషణ్  కూడా అందుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ అభిమానులు గర్వించదగ్గ ఒక విషయం వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే తాజాగా మెగాస్టార్ కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు దక్కించుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి కార్యక్రమాన్ని హైదరాబాద్లో జరిపి అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ని నటుడు అమీర్ ఖాన్ చేతులమీదుగా అందించారు.

చిరంజీవి మొత్తం 156 చిత్రాలలో 537 పాటలలో 24 వేల డాన్స్ మూమెంట్లు వేసినట్లుగా ఈ గిన్నిస్ బుక్ రికార్డులు తెలియజేస్తూ చిరంజీవి పేరును నమోదు చేశారట. 1978లో సెప్టెంబర్ 22న మొదటిసారి చిరంజీవి సినిమా విడుదల అయ్యింది. తన మొదటి రిలీజ్ రోజునే గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకోవడం జరిగింది చిరంజీవి. అయితే ఈవెంట్ కి సాయి ధరంతేజ్, అల్లు అరవింద్, డైరెక్టర్ బాబి తదితర సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

గిన్ని స్ బుక్ లో చిరంజీవి పేరు ఎక్కడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతూ తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.. చిరంజీవి తన నటన కంటే డాన్స్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేదట. అందుకే తనని తాను ప్రతి సినిమాలో కూడా సరికొత్తగా చూపించుకునే వారని తెలుస్తోంది. అందుకే చిరంజీవికి కూడా తనకు ఇష్టమైన డాన్స్ వల్లే ఈ గిన్నిస్ రికార్డు రావడం తనకు ఆనందాన్ని కలిగిస్తోందంటూ వెల్లడిస్తున్నారు. అవార్డు అందుకోవడం కూడా తనకి ఆనందంగా ఉందంటు చిరంజీవి తెలియజేశారు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే చిరంజీవికి ఈ ఏడాది ఏకంగా రెండు అరుదైన అవార్డులు అందుకున్నారు. అదేమిటంటే ఒకటి అత్యుత్తమ పౌరపురస్కారం పద్మవిభూషణ్ ని ఈ ఏడాది మొదట్లో అందుకోగా.. ఇప్పుడు తాజాగా గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కడంతో ఈ ఏడాది డబుల్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: