తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అల్లు రామలింగయ్య గొప్ప నటుడు అయినప్పటికీ ఆయన కుమారుడు ఆయన అల్లు అరవింద్ నటన వైపు పెద్ద స్థాయిలో ఆసక్తి చూపలేదు. ఆయన కెరియర్ మొత్తంలో ఒకటి , రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. కానీ ఈయన ఎక్కువ శాతం నిర్మాణ రంగం వైపు ఆసక్తిని చూపించాడు. అందులో భాగంగా గీత ఆర్ట్స్ అనే సంస్థ ను నెలకొల్పే ఎన్నో సినిమాలను నిర్మించి ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని ఇప్పటికే కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.
తాజాగా అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఈయన ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పుకొచ్చాడు. దానిలో భాగంగా ఈయన ఎవరు అసలైన స్టార్ హీరో అనే దాని గురించి వ్యాఖ్యలు చేశారు. ఈయన వ్యాఖ్యల ప్రకారం అసలైన స్టార్ హీరో ఎవరు అంటే సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమా ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను వెనక్కు తెచ్చే స్టామినా కలిగిన వారే అసలైన స్టార్ హీరోలు అని అల్లు అరవింద్ చెప్పారు. ఇకపోతే కొంత మంది నేటిజెన్లు అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు రామ్ చరణ్ ను లింక్ చేస్తున్నారు.
ఎందుకు అంటే ... ఆయన నటించిన రచ్చ , నాయక మూవీ లకు పరమ రొటీన్ కంటెంట్ తో వచ్చిన సినిమాలు అని టాక్ వచ్చిన కూడా ఆ మూవీ లు 40 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను వసూలు చేశాయి. అలా ఆయన నెగటివ్ టాక్ తో కూడా భారీ ఎత్తున కలక్షన్లను వసూలు చేశాడు. అతని అసలైన స్టార్ హీరో అని వారు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.