మాస్ మహారాజ రవితేజ..ఈయన నటనకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.. ముఖ్యంగా ఇండస్ట్రీలో సొంతంగా ఎదిగిన వారిలో రవితేజ కూడా ఒకరు.ఎందుకంటే రవితేజ కి కూడా సినిమాల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. అయినా కూడా తన నటనతోనే అందర్నీ ఆకట్టుకున్నారు. అలా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ చివరికి పెద్ద స్టార్ గా మారిపోయారు. ఇక అప్పట్లో రవితేజ నటించిన ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి,వెంకీ, ఖడ్గం, భద్ర,దుబాయ్ శీను, విక్రమార్కుడు, కిక్, నేనింతే వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక రీసెంట్ గా ఈయన నటించిన Mr. బచ్చన్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ రవితేజ క్రేజ్ మాత్రం ఇండస్ట్రీలో ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు.అయితే అలాంటి రవితేజ పై ఇండస్ట్రీలో అప్పట్లో కొన్ని రూమర్స్ వినిపించాయి.
అదేంటంటే..రవితేజ అప్పట్లో ఆ హోమ్లి బ్యూటీతో ప్రేమలో పడ్డారని, పెళ్లయినా కూడా ఆ హీరోయిన్ తో సీక్రెట్ గా ఎఫైర్ మెయింటైన్ చేశారనే టాక్ వినిపించింది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు మీరాజాస్మిన్.. రవితేజ మీరాజాస్మిన్ కాంబినేషన్లో భద్ర సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో మీరాజాస్మిన్ రవితేజ కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడి అది కాస్త ఎఫైర్ కి దారి తీసిందని కొంతమంది సినీ జనాలు గుసగుసలు పెట్టుకున్నారు.
కానీ మరి కొంతమందేమో ఇది కేవలం సినిమా కోసమే హీరో హీరోయిన్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అంటుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ భద్ర సినిమా షూటింగ్ సమయంలో రవితేజ మీరాజాస్మిన్ ల గురించి ఎన్నో ఎఫైర్ వార్తలు గుప్పు మన్నాయి.ఇక మీరాజాస్మిన్ ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవ్వాలని చూస్తోంది. అలా అవకాశాల కోసం హాట్ హాట్ డ్రెస్సులు వేస్తూ సోషల్ మీడియాలో కుర్ర కారు మతులు చెడగొడుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతో హోమ్లీగా ఉండే ఈ బ్యూటీ అలా అందాలతో పిచ్చెక్కిచ్చడంతో చాలామంది షాక్ అవుతున్నారు