తన దర్శకులందర్నీ రంగంలోకి దింపుతున్న తారక్.. ఈ దెబ్బతో తెలుగులో అంచనాలు డబల్..?

MADDIBOINA AJAY KUMAR
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర మొదటి భాగంలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ , ఎన్టీఆర్ కి జోడిగా నటించగా కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సైఫ్ ఆలీ ఖాన్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను , కొన్ని పాటలను విడుదల చేశారు. ఈ మూవీ బృందం ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలకు , పాటలకు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా ఈ మూవీ బృందం పూర్తి చేసింది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 22 వ తేదీన అనగా ఆదివారం రోజున నిర్వహించబోతుంది. ఈ మూవీ యూనిట్ భారీ ఎత్తున ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలి అనుకుంది. కాకపోతే పోలీస్ శాఖ నుండి అనుమతులు రాకపోవడంతో నోవేటెల్ హోటల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఈవెంట్ కు అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి , త్రివిక్రమ్ శ్రీనివాస్ , ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మూవీ బృందం మరికొంత కాలంలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే రాజమౌళి , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ సినిమాల్లో నటించాడు. మరికొంత కాలంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: