స్టార్ హీరోయిన్ ని వెంటాడుతున్న దరిద్రం.. లక్కు రాదే..!
ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలు అందుకున్న కృతి శెట్టి రెమ్యూనరేషన్ నీ కూడా అమాంతం పెంచేసింది. బంగార్రాజు సినిమా తర్వాత నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు.. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గడంతో రెమ్యూనరేషన్ తగ్గించుకున్న కూడా అవకాశాలు రాలేదు. చివరిగా మనమే అనే సినిమాలో శర్వానంద్ కు జోడిగా నటించిన ఇది కూడా డిజాస్టర్ గానే పోయింది. దీంతో కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయిన ఈమె ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. తెలుగులో ఏ ఒక్క సినిమా కూడా లేదట.
దీంతో మలయాళం లో టావినో థామస్ జోడిగా ఒక సినిమాలో నటించిన సినిమా మలయాళం లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న.. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల చేయగా తెలుగులో వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం తమిళంలో కార్తీక్ జోడిన నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి త్వరలోనే సిద్ధంగా ఉన్నది.. అలాగే లవ్ టుడే హీరోతో కూడా ఒక సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం కూడా తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే జయం రవి కి జోడిగా జెనీ అనే చిత్రం నటిస్తున్నది ఒకవేళ ఈ చిత్రాలన్నీ హిట్ అయితే తమిళంలోని ఇమేజ్ పెరగడం జరుగుతుంది. లేకపోతే కృతి శెట్టి సినీ కేరియారే క్లోజ్ అవుతుందని పలువురు నెటిజెన్స్ తెలుపుతున్నారు. మరి దరిద్రాన్ని పోగొట్టుకొని సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.