తనతో తానే పోటీ పడుతున్న హీరోయిన్...ఆ హీరోయిన్ ఎవరో తప్పకుండా చూడాల్సిందే...?

frame తనతో తానే పోటీ పడుతున్న హీరోయిన్...ఆ హీరోయిన్ ఎవరో తప్పకుండా చూడాల్సిందే...?

lakhmi saranya
సీనియర్ హీరోయిన్ త్రిష ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త్రిష రీసెంట్ గా చిరంజీవి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరే "విశ్వంభర " అని తెలిసిందే. ఇక ఈ సినిమాలో త్రిష మరో హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో ఫుల్ బిజీ అయిపోయింది త్రిష.
సినీ కెరియర్ ప్రారంభించి 20 వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న నన్నె తరగని గ్లామర్ త్రిష సొంతం. ఇప్పటికీ టాలీవుడ్, బాలీవుడ్లో ఆ అందాల భామ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాదు యువతలో కూడా ఇప్పటికీ ఆమె క్రేజ్ అలాగే ఉంది. ప్రస్తుతం తెలుగులో త్రిష, మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభరా చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష క్యారెక్టర్ ఎంతో వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నాయి యూనిట్ వర్గాలు. కాగా ఈ సినిమాతో పాటు ఆమె తమిళంలో అజిత్ కు జోడిగా ఓ చిత్రంలో నటిస్తున్నారు.
 విదాముయార్చి పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో కూడా త్రిష పాత్ర ఆసక్తికరంగా ఉంటుందట. అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఒకేసారి 2025 సంక్రాంతి ఒరిలో నిలుస్తున్నాయి. సాధారణంగా తెలుగులో సంక్రాంతి పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. అగ్రహీరోల మద్య సంక్రాంతి పోరు ప్రతి ఏడాది సర్వసాధారణమే. అయితే ఈసారి జనవరి 12న చిరంజీవి విశ్వంభరతో పాటు తెలుగు, తమిళ్ భాషలో అజిత్ నటించిన నిదాముయార్చి చిత్రం కూడా విడుదల కానుంది. సో...ఈ సంక్రాంతికి హీరోలా మధ్య పోటీయే కాదు. త్రిష కూడా తనతో తానే పోటీపడుతుంది. ఈ పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇక ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: