దేవర చిత్రం పైన ప్లాన్ ప్రకారమే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా..?
చివరిగా కొరటాల శివ చేసిన ఆచార్య సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇందులో కనిపిస్తున్నాయని అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రవాల సినిమాలోని సన్నివేశాలు అదుర్స్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కనిపిస్తున్నాయనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ చూపించిన తీరు ఎన్టీఆర్ను చూపించిన తీరు చాలా డిఫరెంట్ గా ఉందని.. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పెద్దగా అట్రాక్షన్ అయ్యారా కనిపించడం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో దేవర సినిమాలో కొత్తగా ఏముంది అనే విధంగా అనుమానాలను తెరలేపేలా కొంతమంది కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఈ సినిమా ఫుల్ మీల్స్ ఇస్తుందని చాలా నమ్మకంతో ఉన్నారు. వీటికి తోడు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత కచ్చితంగా హీరోకు క్లాప్ వస్తుందని ఆ అనుమానం కూడా నిజమయ్యేలా ఉందంటూ చాలామంది నెగిటివ్ గానే దేవర సినిమా పైన కామెంట్స్ చేస్తున్నారు. దేవర సినిమా విజువల్స్ పరంగా చూస్తే అదిరిపోయాయని కొన్ని యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టేసారని తెలుస్తోంది. సంగీతం అనిరుద్ అదరగొట్టేసారని.. జూనియర్ ఎన్టీఆర్ ఇందులో తండ్రి, కొడుకులు గా కనిపించబోతున్నారు. మరి ఇలాంటి విషయాలు అన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఈనెల 27వ తేదీ వరకు ఆకాల్సిందే .